త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

V. Hanumantha Rao | బీసీ కుల‌గ‌ణ‌న చేపట్టేదాకా నిరాహార దీక్ష కొన‌సాగిస్తా: వీహెచ్

V. Hanumantha Rao | బీసీ (BC)ల కుల గ‌ణ‌న (Census) చేప‌ట్టాల‌నే డిమాండ్‌తో ప్రభుత్వ సలహాదారు, ఓబీసీ ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అంబర్ పేటలోని త‌న‌ నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష దిగారు. ఆయ‌నకు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్సీ కోదండ‌రామ్‌ (Kodandaram), ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్‌, బీసీ సంఘం సీనియ‌ర్ నాయ‌కులు దీక్ష‌లో కూర్చున్నారు.

S

News | Published On May 9, 2026, 11.50 am IST

V. Hanumantha Rao | బీసీ కుల‌గ‌ణ‌న చేపట్టేదాకా నిరాహార దీక్ష కొన‌సాగిస్తా: వీహెచ్
Advertisement

V. Hanumantha Rao | త్రినేత్ర‌.న్యూస్‌: బీసీ (BC)ల కుల గ‌ణ‌న (Census) చేప‌ట్టాల‌నే డిమాండ్‌తో ప్రభుత్వ సలహాదారు, ఓబీసీ ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అంబర్ పేటలోని త‌న‌ నివాసంలో నిరవధిక నిరాహార దీక్ష (Indefinite hunger strike) దిగారు. ఆయ‌నకు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్సీ కోదండ‌రామ్‌ (Kodandaram), ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్‌, బీసీ సంఘం సీనియ‌ర్ నాయ‌కులు దీక్ష‌లో కూర్చున్నారు. ఈ సంద‌ర్భంగా వారు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కుల గ‌ణ‌న‌లో బీసీ ప్ర‌జ‌ల‌ను చేర్చాల‌ని.. 60 శాతం వారికి న్యాయం చేయాల‌న్నారు.

నిర‌వ‌ధిక నిరాహార‌ దీక్ష సంద‌ర్భంగా హ‌నుమంత‌రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో ఓబీసీలను కూడా లెక్కించాల‌ని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీల అభ్యున్నతికి, బీసీ జనాభా ప్రతిపాదికన‌ న్యాయం జరగాల‌న్నారు. ఇందుకోసం జనగణనలో బీసీ జనాభా కూడా లెక్కించాల‌ని కోరారు. ఈ విష‌య‌మై పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖలు రాసినా కూడా సరైన స్పంద‌న రాలేద‌ని వాపోయారు. కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో క‌ద‌లిక వ‌చ్చే వ‌ర‌కు ఈ దీక్ష కొన‌సాగుతుంద‌ని వీహెచ్ స్ప‌ష్టం చేశారు. కాగా బీసీల కుల గ‌ణ‌న చేయ‌ని ప‌క్షంలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు కూర్చుంటాన‌ని ఇటీవ‌ల వీహెచ్ పేర్కొన్న విష‌యం విదిత‌మే.

Advertisement
Advertisement