Oath taking | ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం
Oath taking | శాసన మండలి ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్ (Azharuddin), కోదండరాం (Kodandaram) ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukendar Reddy) వారితో ప్రమాణస్వీకారం చేయించారు.
Oath taking | త్రినేత్ర.న్యూస్: శాసన మండలి ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్ (Azharuddin), కోదండరాం (Kodandaram) ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా ఏర్పడిన నిరీక్షణకు తెర పడినట్లైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukendar Reddy) వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు, ఎంమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

గవర్నర్ కోటాలో కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

మైనారిటీలకు సీఎం పెద్దపీట: అజారుద్దీన్
ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా తనను ప్రతిపాదించినందుకుఉ కాంగ్రెస్ అధిష్ఠానానికి, మంత్రి మండలికి, పీసీసీకి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం మరింత కృషి చేసేందుకు అవకాశం లభించిందని చెప్పారు. రాజకీయాల్లో, జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలన్నారు. జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారనే వార్తలో వాస్తవం లేదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మొదట్నుంచీ మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.
ఇక ముందూ పోరాడతా: కోదండరాం
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. ఇందుకు ప్రజలకు హామీ ఇస్తున్నాను. యూనివర్సిటీల పునరుద్ధరణ, బీసీ రిజర్వేషన్ల సాధన వంటి అనేక అంశాలపై పని చేస్తూనే ఉన్నాం. ఈ ఎమ్మెల్సీ పదవి అందుకు మరింత ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఇంతకాలం పోరాడినట్లే ప్రజల తరఫున ఇకముందూ పోరాడతాం.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



