Droupadi Murmu | రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu | శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించారు.
Droupadi Murmu | హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం హైదరాబాద్ నగరానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించారు. ఉదయం 9.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరి 10.15 గంటలకు ఫిల్మ్ సిటీకి ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది.
అక్కడ ఏర్పాటు చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చైర్‌పర్సన్‌ల నేషనల్ కాన్ఫరెన్స్‌కు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించనున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్పర్సన్ల నేషనల్ కాన్ఫరెన్స్ 2 రోజుల పాటు జరగనుండగా, రేపు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం.
మధ్యాహ్నం భోజనం చేశాక భారత వాయుసేనకు సంబంధించిన ప్రత్యేక హెలికాప్టర్‌లో రాష్ట్రపతి తిరిగి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. నో ఫ్లై, నో డ్రోన్ జోన్‌గా రాచకొండ సీపీ సుధీర్‌బాబు ప్రకటించారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఉప్పల్ మార్గంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. నాగోల్, ఉప్పల్, సర్వే ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






