Harish Rao | సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలి: హరీశ్‌రావు
Harish Rao | ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదిక(Social media platform)గా ఎప్పటికప్పుడు ఎండగట్టాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యకర్త అత్యంత చురుకుగా ఉండాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. గురువారం బీఆర్ఎస్(BRS)లో చేరిన బొల్లారం కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
త్రినేత్ర.న్యూస్: ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదిక(Social media platform) గా ఎప్పటికప్పుడు ఎండగట్టాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యకర్త అత్యంత చురుకుగా ఉండాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. గురువారం బీఆర్ఎస్(BRS)లో చేరిన బొల్లారం కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన యువతను ఉద్దేశించి హరీశ్ రావు మాట్లాడారు.

పార్టీలో చేరిన వారికి అభినందనలు..
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో సోషల్ మీడియానే నేడు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గాలను, మోసాలను చూసి సహించలేక బీఆర్ఎస్ పార్టీలో చేరిన సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు, సభ్యులందరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర యువతను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దగా చేసిందని విమర్శించారు. ఎన్నికలకు ముందు లెక్కలేని హామీలిచ్చి తీరా గద్దెనెక్కి అధికారంలోకి వచ్చాక నిలువునా ముంచిందని ఆరోపించారు.
కాంగ్రెస్ మోసాలను ప్రజలకు తెలియజేయాలి..
జాబ్ క్యాలెండర్ లేదు, కొత్తగా ఉద్యోగాల కల్పన లేదు. వారు చెప్పిన రెండు లక్షల ఉద్యోగాల హామీ పూర్తిగా బోగస్ అని తేలిపోయింది. యువతతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం వంచించింది. అవ్వా తాతలకు పెన్షన్లు పెంచకుండా, కోటి మంది మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వకుండా, రైతన్నలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రతి వర్గాన్ని దారుణంగా మోసం చేసింది. ఈ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీలాంటి యువత ముందుకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి. కాంగ్రెస్ చేస్తున్న ప్రతి మోసాన్ని సామాన్య ప్రజలందరికీ చేరవేయాల్సిన బాధ్యత యువతపై ఉంది అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండీ ఆరిఫ్ తో పాటు మరో 25 మంది సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు పార్టీ ఇన్‌ఛార్జి ఆదర్శ్ రెడ్డి, ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



