Navin Mittal | విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం : నవీన్ మిత్తల్
Navin Mittal | విద్యుత్ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, సంబంధిత అంశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ హామీ ఇచ్చారు. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ప్రతినిధులు సోమవారం నవీన్ మిత్తల్‌ను కలిసి విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక సమస్యలను వినిపించారు.
Navin Mittal | విద్యుత్ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, సంబంధిత అంశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ హామీ ఇచ్చారు. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ప్రతినిధులు సోమవారం నవీన్ మిత్తల్‌ను కలిసి విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక సమస్యలను వినిపించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ కోసం వెంటనే కమిటీ ఏర్పాటు చేయాలని టీజేఏసీ ప్రతినిధులు కోరారు. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్, జీపీఎఫ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వైటీపీఎస్ కోల్, యాష్ ప్లాంట్ టెండర్ల అంశంలో ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని, అవసరమైతే నిబంధనల్లో మార్పులు చేయాలని కోరారు.
పదవీ విరమణ పొందిన ఈపీఎఫ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు, ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్లను వెంటనే మంజూరు చేయాలని జేఏసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. 35 నుంచి 36 సంవత్సరాల సేవ అనంతరం పదవీ విరమణకు చేరువలో ఉన్న ఉద్యోగులకు శాశ్వత ప్రమోషన్లు కల్పించాలని కోరారు. విద్యుత్ సంస్థల్లో వివిధ కేడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరాన్ని కూడా వారు ప్రస్తావించారు. ఉద్యోగుల కొరత కారణంగా ప్రస్తుతం సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని, ఇది సేవల నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు, థర్డ్ డిస్కమ్ అంశంతో పాటు ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్యోగి సంఘాలు, యాజమాన్యం, ప్రభుత్వం భాగస్వామ్యంతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చాలని టీజేఏసీ ప్రతిపాదించింది.
జేఏసీ ప్రస్తావించిన అంశాలపై నవీన్ మిత్తల్ సానుకూలంగా స్పందించారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి అపోహలను నమ్మవద్దని సూచించారు. విద్యుత్ రంగ అభివృద్ధి, సంస్థల ప్రగతిని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ముఖ్యంగా వర్షాకాలంలో అప్రమత్తంగా వ్యవహరించి విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఉద్యోగులు, యాజమాన్యం, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పీఆర్సీ, ఈపీఎఫ్-జీపీఎఫ్ సమస్యలు, వైద్య సదుపాయాలు, ప్రమోషన్లు, కొత్త నియామకాలు, ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు, థర్డ్ డిస్కమ్ ఉద్యోగుల భద్రత తదితర అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం పట్ల టీజేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంతో విద్యుత్ రంగం మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy Delhi Tour | మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్ కీలక అడుగు: కిషన్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రితో భేటీ
- ●Nalgonda Family Suicide | నల్గొండలో గుండెల్ని పిండేసే విషాదం: తలుపులు బద్దలుకొట్టి చూస్తే కుళ్లిన స్థితిలో నాలుగు డెడ్ బాడీలు
- ●Telugu Web Series | అప్పట్లో సూపర్ హిట్ సీరియల్ ...ఇప్పుడు వెబ్‌సిరీస్‌గా అరవై ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్
- ●Minister Seethakka | రూ.20 కోట్లతో 'హై లెవల్ బ్రిడ్జి'.. దశాబ్దాల కష్టాలకు చెక్ పెట్టిన మంత్రి సీతక్క
- ●Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు - సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్
- ●Cybercrime Refund Hyderabad | ఆన్లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల 'రీఫండ్'

CM Revanth Reddy Delhi Tour | మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్ కీలక అడుగు: కిషన్ రెడ్డితో కలిసి రైల్వే మంత్రితో భేటీ

Nalgonda Family Suicide | నల్గొండలో గుండెల్ని పిండేసే విషాదం: తలుపులు బద్దలుకొట్టి చూస్తే కుళ్లిన స్థితిలో నాలుగు డెడ్ బాడీలు

Telugu Web Series | అప్పట్లో సూపర్ హిట్ సీరియల్ ...ఇప్పుడు వెబ్‌సిరీస్‌గా అరవై ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్

Minister Seethakka | రూ.20 కోట్లతో 'హై లెవల్ బ్రిడ్జి'.. దశాబ్దాల కష్టాలకు చెక్ పెట్టిన మంత్రి సీతక్క







