త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RS Praveen Kumar | భ‌గీర‌థ్ ఒక్క‌డికే స్పెష‌ల్‌గా ప‌రీక్ష‌లు పెట్ట‌డం ఏంటి?

RS Praveen Kumar | బండి భగీరథ్‌ ఒక్కడికే మహేంద్ర యూనివర్సిటీ స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటని.. చర్లపల్లి జైలులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ సెంటర్ ఉంటుందని.. పరీక్షలు జైల్లో పెట్టవచ్చని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. లేదంటే పోలీస్ ప్రొటెక్షన్‌తో మహేంద్ర‌ యూనివర్సిటీకి తీసుకెళ్లి పరీక్షలు రాయించి తిరిగి జైలుకు తీసుకు రావచ్చని పేర్కొన్నారు. బండి భగీరథ్ బెయిల్‌పై న్యాయస్థానం పునరాలోచన చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On Jun 22, 2026, 7.42 pm IST

RS Praveen Kumar | భ‌గీర‌థ్ ఒక్క‌డికే స్పెష‌ల్‌గా ప‌రీక్ష‌లు పెట్ట‌డం ఏంటి?
Advertisement
  • జైల్లో ప‌రీక్ష‌లు పెట్టొచ్చు.. లేదంటే పోలీస్ ప్రొటెక్ష‌న్‌తో మ‌హేంద్ర‌ యూనివ‌ర్సిటీకి తీసుకెళ్లి పెట్టొచ్చు
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసును స‌రిగా వాదించ‌లేదు
  • ఈ కేసులో భగీరథ్ పాత్ర ఎంతుందో బండి సంజయ్, సంగప్ప పాత్ర అంతే ఉంది
  • మీడియా స‌మావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఫైర్‌

RS Praveen Kumar | త్రినేత్ర‌.న్యూస్‌: బండి భగీరథ్‌ ఒక్కడికే మహేంద్ర యూనివర్సిటీ స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటని.. చర్లపల్లి జైలులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్ సెంటర్ ఉంటుందని.. పరీక్షలు జైల్లో పెట్టవచ్చని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు. లేదంటే పోలీస్ ప్రొటెక్షన్‌తో మహేంద్ర‌ యూనివర్సిటీకి తీసుకెళ్లి పరీక్షలు రాయించి తిరిగి జైలుకు తీసుకు రావచ్చని పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎందుకు బలమైన వాదనలు వినిపించలేదని ప్ర‌శ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే బండి భగీరథ్‌కు సహకరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స‌ర్కార్‌పై మండిప‌డ్డారు. పోక్సో కేసు నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీస్ అధికారులకు శిక్షలు తప్పవని హెచ్చ‌రించారు. బండి భగీరథ్ బెయిల్‌పై న్యాయస్థానం పునరాలోచన చేయాలని విజ్ఞ‌ప్తి చేశారు.

మహిళల రక్షణ కోసం కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కేసీఆర్ హయాంలో షీ టీంల ఏర్పాటుతో పాటు 30 వేల మంది మహిళా కానిస్టేబుళ్ల నియామకం జరిగింది. మహిళలపై దాడులు జరిగితే కేసీఆర్ కాంప్రమైజ్ కాలేదు. బాలికల‌కు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఇపుడు బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నా నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోంది. పేట్ బషీరాబాద్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు బండి భగీరథ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. చివరకు భాధితురాలిని నిందితురాలిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నోరు తెరవలేదు అని ఆర్ఎస్‌పీ ఫైర‌య్యారు.

బండి భగీరథ్‌ కేసులో ప్రధానమంత్రి పర్యటన ముగిసిన తర్వాత సెక్షన్ 6, పోక్సో కేసులలో బీఆర్ఎస్ ఒత్తిడితోనే చేర్చారు. బండి భగీరథ్‌ను సరెండర్ చేయాలని అతని తండ్రి బండి సంజయ్‌ను సీఎం రేవంత్ రెడ్డి అడుక్కున్నారు. మూడు సార్లు బెయిల్ రిజెక్ట్ అయింది. బీజేపీ ఐటీ సెల్‌లో భాదితురాలి ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు. పోక్సో కేసుకు ప్రత్యేక రూల్స్ ఉన్నాయి. ఈ కేసులో ఏం జరుగుతుందో మాకు చెప్పడం లేదని భాధితురాలి తల్లి అంటోంది. పోక్సో యాక్ట్ ప్రకారం నిందితుడు ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేశారో బాధితులకు చెప్పాలి. ప్రతీ సమాచారం ఇవ్వాలి. స్టేట్‌మెంట్ రికార్డ్స్ బాధితురాలికి ఎందుకు ఇవ్వడం లేదు అని ప్ర‌వీణ్‌కుమార్ నిల‌దీశారు.

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మైత్రి బంధాన్ని ఇబ్బంది పెడుతుందని బాధితురాలిపై మీకు కోపమా? సీఎం రేవంత్ రెడ్డి బండి భగీరథ్‌ను రక్షించాలని చూస్తున్నారు. బండి సంజయ్ కు, సంగప్పకు పోలీసులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? బెయిల్ వచ్చిన విషయం ఎవరికి తెలియదు. బెయిల్ వచ్చిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు. మహేంద్ర యూనివర్సిటీలో బండి భగీరథ్‌పై రెండు కేసులు ఉన్నాయి. బెయిల్ పిటీషన్ బయటకు వచ్చింది. బెయిల్ ఆర్డర్ ఎందుకు బయటకు రాలేదు. పోలీసులు బాధితురాలిని క్రిమినల్‌గా చూస్తున్నారు అని ప్ర‌వీణ్ ఆరోపించారు.

బాల్క సుమన్ జైలు నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం స్పెషల్ పీపీని నియమించింది. బాల్క సుమన్‌ను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. బాధితురాలికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఎందుకు నియమించలేదు. బంగారు లక్ష్మణ్ లక్ష రూపాయలు తీసుకున్నారని బయటకు వస్తే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. బంగారు లక్ష్మణ్ మాదిగ అనే ఆయనపై బీజేపీ చర్యలు తీసుకుంది. బంగారు లక్ష్మణ్‌కు ఒక రూల్, బండి సంజయ్ కు ఒక రూలా? అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ ప్ర‌శ్నించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై చర్యలు తీసుకోవాలి..

ప్రధానమంత్రి మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఒకే వేదిక పంచుకున్నారు. కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై బండి భగీరథ్ ను కాపాడుతున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకువస్తాం. బండి భగీరథ్ బెయిల్ కు సహకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై చర్యలు తీసుకోవాలి. ఇంకా ఈ కేసులో ఎందుకు ఛార్జీషీట్ వేయడం లేదో అర్థం కావడం లేదు. ఈ కేసును నీరు గార్చే ప్రయత్నాలను బీఆర్ఎస్ ప్రతిఘటిస్తుంది అని ప్ర‌వీణ్ కుమార్ హెచ్చ‌రించారు.

 

Advertisement
Advertisement