త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Rains | ఐదురోజులు భారీ వ‌ర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

TG Rains | తెలంగాణ‌లో రాగ‌ల నాలుగైదు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. తీవ్ర‌మైన ఉరుములు, మెరుపులు, గంట‌కు 40-50 కిలోమీట‌ర్ల ఈదురుగాలులు వీచే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది.

P

Telangana | Published On Jun 22, 2026, 7.38 pm IST

TG Rains | ఐదురోజులు భారీ వ‌ర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Advertisement

TG Rains | తెలంగాణ‌లో రాగ‌ల నాలుగైదు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. తీవ్ర‌మైన ఉరుములు, మెరుపులు, గంట‌కు 40-50 కిలోమీట‌ర్ల ఈదురుగాలులు వీచే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డుతాయ‌ని హెచ్చ‌రించింది. మంగ‌ళ‌వారం జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో.. బుధ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంది.

గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ జిల్లాలు అక్క‌డ‌క్క‌డ భారీ వాన‌లు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని చెప్పింది. శుక్ర‌వారం న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబాబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. శ‌ని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంట‌కు 40-50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని వివ‌రించింది.

Advertisement
Advertisement