Prashanth Reddy | రేవంత్ స్పీచ్‌కు సిద్దిపేట డ్రైనేజీలు పొంగిపొర్లినయట.. నాకు ఫోన్ చేసి చెప్పిర్రు
Prashanth Reddy | నిన్న సీఎం రేవంత్ (Revanth Reddy) మాట్లాడిన తీరుతో సిద్దిపేట డ్రైనేజీలు పొంగిపొర్లినట్లు కొందరు ఫోన్ చేసి చెప్పారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి Prashanth Reddy) ఎద్దేవా చేశారు.
- పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి హౌస్ కీపింగ్ పని చేస్తున్నాడు
- మూడేళ్ల నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టడానికే సభలు పెడుతున్నడు
- ఆయన మానసిక పరిస్థి బాలేనట్టుంది
- రేవంత్‌పై మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శలు
Prashanth Reddy | త్రినేత్ర న్యూస్: నిన్న సీఎం రేవంత్ (Revanth Reddy) మాట్లాడిన తీరుతో సిద్దిపేట డ్రైనేజీలు పొంగిపొర్లినట్లు కొందరు ఫోన్ చేసి చెప్పారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి Prashanth Reddy) ఎద్దేవా చేశారు. మోరిలా నోరు వేసుకొని ప్రతిపక్షాలను తిట్టడమే సరిపోతుందన్నారు. పరిపాలన చేయాల్సిన సీఎం హౌస్‌కీపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును తిట్టేందుకు రేవంత్ రెడ్డి సభలు పెడుతున్నాడని విమర్శించారు. మూడేళ్ల నుంచి ఇదేపని పెట్టుకున్నాడన్నారు. ఆయన మానసిక స్థితిని చూస్తూ జాలేస్తుందన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సిద్దిపేటలో రేవంత్ రెడ్డి వాడిన భాష, మాట్లాడిన తీరు చూసి నాకు కొంతమంది ఫోన్ చేశారు. రేవంత్ రెడ్డి నోటిదూలతో మాట్లాడిన మాటలు చూసి సిద్దిపేట డ్రైనేజ్ లు పొంగిపొర్లుతున్నాయి అన్నారు. సిద్దిపేటలో తుపాకీ రాముడు మాటలే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా తీర్చాలో మాట్లాడలేదు. పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి హౌస్ కీపింగ్ పని చేస్తున్నాడు.
సిద్దిపేటలో కాంగ్రెస్ లేనేలేదు
సిరిసిల్ల, సిద్దిపేటలో గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తానని అంటున్నాడు. ఇప్పుడు ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులు నింపేందుకు రేవంత్ రెడ్డికి చేత కావడం లేదు. సిద్దిపేట సభకు నాలుగు ఐదు నియోజకవర్గాల నుంచి ప్రజలను తీసుకొచ్చారు. సిద్దిపేట తెలంగాణ ఆత్మ గౌరవానికి అడ్డా, కేసీఆర్ అడ్డా. తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చిన గడ్డ. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ లేనేలేదు. సిద్దిపేట ప్రజల గుండెల్లో కేసీఆర్, హరీష్ రావు చిరస్థాయిగా నిలిచిపోతారు. కేసీఆర్ అంటే ఒక చరిత్ర, కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు.
మడమ తిప్పకుండా చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్ గా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ పై విమర్శ చెయ్యడం అంటే ఆకాశంపై ఉమ్మి వెయ్యడమే. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది చంద్ర బాబు నాయుడు. చంద్రబాబు నాయుడుపై తిరుగుబాటు చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డినే తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచాడు.
ఆంధ్రా అల్లుడిని ఎలా తెచ్చుకున్నవ్?
50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. కేసీఆర్ పెట్టిన అనేక పథకాలు రేవంత్ రెడ్డి బంద్ పెట్టాడు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. హరీష్ రావు నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు. కేసీఆర్ ఇచ్చిన బాధ్యతలను వంద శాతం న్యాయం చేసిన వ్యక్తి హరీష్ రావు. హరీష్ రావు కుటుంబానికి పాల వ్యాపారం ఉంది. పాలు ఎవరికీ అవసరం అయితే వారికి పాలు పోస్తారు.
హరీశ్‌రావు ఆంధ్రోళ్లకు పాలు పోస్తే ఆంధ్రోళ్ల అల్లుడిని ఎలా తెచ్చుకున్నావు రేవంత్ రెడ్డి?
తెలంగాణ ఉద్యమం సమయంలో చంద్ర బాబు నాయుడు లాంటి వాళ్ళకే వాత పెట్టారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాదినని చెప్పుకోవడం ఎనిమిదో వింతలా ఉంది. ఉద్యమం సమయంలో రైఫిల్ తీసుకొని పోయిన ఘటన ఎవరు మర్చిపోలేదు రేవంత్ రెడ్డి. ఉద్యమం సమయంలో తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుందే కేసీఆర్. ఉద్యమకారుల త్యాగం గొప్పదని కేసీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు. ఉద్యమకారులను బీఆర్ఎస్ రాజకీయం కోసం వాడుకోలేదు. శ్రీకాంతా చారి తల్లిని పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి నీచ రాజకీయం చేశాడు. శ్రీకాంత్ చారి తల్లికి హుజూర్ నగర్ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనే. శంకరమ్మపై అభ్యర్థిని పెట్టి ఓడించారు. శ్రీకాంతా చారి తల్లి అంటే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు గౌరవం.
రాజగోపాల్‌రెడ్డిని ఎర్రగడ్డకు పంపిస్తడట
అవినీతికి నిలువుటద్దమే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కుటుంబం. రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతిపై మన్నె క్రిశాంక్ ఆధారాలతో సహా చెప్పాడు. భూముల పైనే 5 లక్షల కోట్లు రేవంత్ రెడ్డి సంపాదించాడని సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డే అంటున్నాడు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించే దమ్ము ఉందా రేవంత్ రెడ్డి. అలా మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డిని ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపిస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
కుంభకోణాలకు అడ్డగా గాంధీ భవన్ మారిపోయింది. ఇప్పటి నుంచి కాంగ్రెస్ కాదు, స్కాంగ్రేస్. రేవంత్ రెడ్డి చంద్ర బాబు నాయుడు శిష్యుడని సమాజం మొత్తం తెలుసు. కన్నేపల్లి పంపులు ఆన్ చేయకుండా చంద్ర బాబు నాయుడుకు నీళ్ళు వదిలిపెట్టారు. తెలంగాణకు కాలం తెచ్చిన కరవు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరవు. రాబోయేది కేసీఆర్, రేవంత్ రెడ్డి కుంభకోణాలు బయటపెట్టి రేవంత్ రెడ్డి అంతు చూసేది కేసీఆరే అని ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత బొమ్మెర రాంమూర్తి పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao | అసెంబ్లీ ముందు నిన్ను బట్టలిప్పి నిలబెడతా
- ●Thiruparankundram Hilltop Lamp Ritual | మదురై కొండపై కార్తీక దీపం వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు
- ●Most Forts State | ఒక్క రాష్ట్రంలోనే ఇన్ని కోటలా? ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- ●Nifty Bank | బ్యాంకింగ్ షేర్లలో భారీ ర్యాలీ.. సరికొత్త మైలురాయికి చేరిన బ్యాంక్ నిఫ్టీ సూచీ..
- ●Esther Anil | బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా వెంకటేష్ చిన్నకూతురు - తొమ్మిది భాషల్లో రిలీజ్
- ●Samantha | తల్లయిన సమంత - కొడుకు పేరు చెప్పేసింది!

Harish Rao | అసెంబ్లీ ముందు నిన్ను బట్టలిప్పి నిలబెడతా

Thiruparankundram Hilltop Lamp Ritual | మదురై కొండపై కార్తీక దీపం వివాదం.. సుప్రీం కీలక ఆదేశాలు

Most Forts State | ఒక్క రాష్ట్రంలోనే ఇన్ని కోటలా? ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Nifty Bank | బ్యాంకింగ్ షేర్లలో భారీ ర్యాలీ.. సరికొత్త మైలురాయికి చేరిన బ్యాంక్ నిఫ్టీ సూచీ..





