త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KA Paul | క‌విత నన్ను రూ. 10 కోట్లు అడిగారు.. కానీ కేసీఆర్ : కేఏ పాల్

KA Paul | తెలంగాణ రక్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న‌ను గ‌తంలో రూ. 10 కోట్లు అడిగార‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ ఆరోపించారు. దోచుకున్న‌, దాచుకున్న డ‌బ్బుతో ఇవాళ న్యూస్‌లో ఫ్రంట్ పేజీలో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నార‌ని ఆమెపై కేఏ పాల్ నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On May 3, 2026, 2.06 pm IST

KA Paul | క‌విత నన్ను రూ. 10 కోట్లు అడిగారు.. కానీ కేసీఆర్ : కేఏ పాల్
Advertisement

KA Paul | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ రక్ష‌ణ సేన చీఫ్ క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న‌ను గ‌తంలో రూ. 10 కోట్లు అడిగార‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ ఆరోపించారు. దోచుకున్న‌, దాచుకున్న డ‌బ్బుతో ఇవాళ న్యూస్‌లో ఫ్రంట్ పేజీలో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నార‌ని ఆమెపై కేఏ పాల్ నిప్పులు చెరిగారు.

2008లో క‌విత నా చారిటీ సిటీకి వ‌చ్చిన‌ప్పుడు రూ. 10 కోట్లు అడిగితే.. రూ. 15 కోట్లు ఇస్తానన్న‌.. క‌విత అడుగుతుంది ఎంత ఇవ్వ‌మంటారు అని కేసీఆర్‌ను అడిగాను.. క‌విత‌ను న‌మ్మొద్దు.. ఏమీ డ‌బ్బులు ఇవ్వొద్దు అని చెప్పారు. కేవ‌లం అన్న‌తో ఉన్న గొడ‌వ‌ల‌తో తండ్రి సెటిల్ చేయ‌క‌పోతే.. ల‌క్షల కోట్ల ఆస్తుల కొర‌కు.. ఎందుకంటే తెలంగాణ ఏర్ప‌డిన‌ప్పుడు ల‌క్షా 40 వేల కోట్లు మిగిలింది. ఆయ‌న ప‌ది సంవ‌త్స‌రాలు ఏలిన‌ప్పుడు దాదాపు 25 ల‌క్ష‌ల కోట్లు బ‌డ్జెట్. ఆ త‌ర్వాత రూ. 8 ల‌క్ష‌ల కోట్ల అప్పు. దాదాపు రూ. 35 ల‌క్ష‌ల కోట్ల‌లో ఎన్ని ల‌క్ష‌ల కోట్లు మిగిలింది. అన్న‌కు ఎన్ని ల‌క్ష‌ల కోట్లు ఇవ్వాలి. నాకు ఎందుకు సీఎం పోస్టు ఇవ్వ‌రు. నా ద‌గ్గ‌ర వేల కోట్లు ఉన్నాయి.. ఖ‌ర్చు పెడుతాను అని చెప్పి ఫ్రంట్ పేజీల్లో న్యూస్‌లు వేయించుకుని మ‌న బీసీ, కాపులు, ఎస్సీల‌ను మోసం చేయ‌డానికి క‌విత‌ను దించారు అని కేఏ పాల్ ధ్వ‌జ‌మెత్తారు.

ల‌క్ష‌ల కోట్లు సంపాదించ‌డానికి తండ్రితో ఫైట్ చేస్తుంది..

వాళ్లే దోచుకోవ‌డం, దాచుకోవ‌డం, ఖ‌ర్చు పెట్ట‌డం.. అందుకే క‌విత వేల కోట్లు దోచుకున్న‌ది.. దాచుకున్న‌ది.. ల‌క్ష‌ల కోట్లు సంపాదించ‌డానికి తండ్రితో ఫైట్ చేస్తుంది. ష‌ర్మిల ఏ విధంగా జ‌గ‌న్‌తో ఫైట్ చేసిందో.. అప్పుడే చెప్పాను ష‌ర్మిల పార్టీ ఫైట్ కొర‌కే. స‌క్సెస్ అవ్వ‌దు.. క్లోజ్ అయిత‌దని చెప్పాను. ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ టీడీపీ, బీజేపీలో క‌లిసిపోత‌ది. చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం అవుతాడ‌ని 2008లో నేను చెప్ప‌లేదా..? ఎంపీ తీసుకుని 2011లో విలీనం అయిపోలేదా..? ఇంకెన్ని సార్లు మోస‌పోతారు. కోదండ‌రాం లాంటి మంచివారికి అవ‌కాశం ఇవ్వ‌లేదా..? అని పాల్ గుర్తు చేశారు.

ఆవిడ‌కు క‌నీసం ఏబీసీడీలు కూడా తెలియ‌దు..

ఈ రోజు తెలంగాణ అప్పు 12 ల‌క్ష‌ల కోట్లు. ఆంధ్రా అప్పు 13 ల‌క్ష‌ల కోట్లు. అప్పులు ఎలా తీర్చుతార‌ని అడిగితే.. ల‌క్ష కోట్లు మిగిలి ఉన్నాయ‌ని క‌విత అన్న‌ది. అంటే ఆవిడ‌కు క‌నీసం ఏబీసీడీలు కూడా తెలియ‌దు. ల‌క్ష కోట్లు మిగ‌ల్లేదు.. సంవ‌త్స‌రానికి ఇప్పుడు తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ ల‌క్ష కోట్లు దాటి అప్పు చేస్తుంది. వ‌డ్డీ దాదాపు 50 వేల కోట్లు. ఆదాయం కేవ‌లం రూ. 2 ల‌క్ష‌ల కోట్లే. అర్థం చేసుకోండి అని పాల్ అన్నారు.

అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపిస్తాను..

రెండు తెలుగు రాష్ట్రాల అప్పు 25 ల‌క్ష‌ల కోట్ల‌కు పోయింది. దేశం అప్పు వంద‌ల ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. ఎవ‌రైనా తీర్చ‌గ‌లిగారా..? తెలుసుండి ఎందుకు మోస‌పోతారు. కుటుంబ అవినీతి కుట్ర పాల‌కుల‌కు ఎందుకు స‌పోర్టు చేస్తారు. య‌స్ వాళ్లు మీడియాకు కోటి రూపాయాలు ఇచ్చి ఫ్రంట్ పేజీలో వ‌స్తారు. అది వ‌ద్దు మ‌న‌కు మార్పు రావాలి ఆ మార్పు మ‌న‌మే తేవాలి. ఆ అభివృద్ధి మ‌న‌మే చేయాలి.. మ‌నంద‌రం క‌లిసి పోరాడాలి. ప్ర‌జాశాంతి పార్టీ అవినీతి లేని పార్టీ. అంద‌ర్నీ అభివృద్ధి చేసే పార్టీ. మీరు నేను క‌లిసి చేద్దాం. 2028, 2029 ఎన్నిక‌ల్లో సంపూర్ణ మెజార్టీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గెలుద్దాం. అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపిస్తాను. ఇరాన్ యుద్ధం సాల్వ్ కాగానే నేను మ‌ళ్లీ వ‌స్తాను. క‌లిసి ప‌ని చేద్దాం. అభివృద్ధి చేసుకుందాం అని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement