KA Paul | రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి.. కేఏ పాల్ డిమాండ్
KA Paul | సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రెండేండ్ల ప్రజా పాలనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల( Assembly Elections ) సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
KA Paul | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రెండేండ్ల ప్రజా పాలనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల( Assembly Elections ) సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేఏ పాల్ ఓ వీడియో విడుదల చేశారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి రెండేండ్లు పూర్తయింది. ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా అన్నాడు. నేను కూడా ఏడెనిమిది సార్లు రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేస్తే అప్పుల నుంచి బయటపడుతామో చెప్పాను. కానీ నేను ఇచ్చిన సలహాలన్నింటికి వ్యతిరేకంగా పని చేశాడు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పాల్ పేర్కొన్నారు.
ఓట్ల కోసం 100కు పైగా అబద్ధపు వాగ్దానాలు
రాజీనామా ఎందుకు రాజీనామా చేయాలంటే.. ఆరు గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తామన్నారు.. అది కూడా ఇవ్వలేదు. రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదు. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కంపెనీలు పెట్టిస్తానన్నాడు. అది కూడా సాధ్యం కాలేదు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ కూడా చేయలేదు. మహిళలకు రూ. 2500 ఇవ్వలేదు. ఓట్ల కోసం 100కు పైగా అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని పాల్ మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు లక్షల కోట్లు సంపాదించారు..
వాగ్దానాలపై ప్రజలు నిలదీసే సరికి నా వద్ద డబ్బు లేదు.. కోసుకుతినండి అని మాట్లాడుతున్నాడు. దేశంలోనే నంబర్ వన్‌గా హైదరాబాద్ సిటీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో అట్టడుగు స్థానానికి చేరుకుంది. ఎకరం కోటి రూపాయాలు ఉన్న భూముల ధరలు ఇప్పుడు రూ. 50 లక్షలకు పడిపోయాయి. వందల కంపెనీలు హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లిపోతున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు ఆయన అన్నదమ్ముళ్లు లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన కేబినెట్‌లోని మినిస్టర్లందరూ కూడా వందల, వేల కోట్లు సంపాదించుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడి మీద కూడా రుజువులతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల HILT స్కాం పేరిట 9,300 ఎకరాలను అమ్మేసి రూ.5 లక్షల కోట్ల స్కాం చేసేందుకు సిద్ధమయ్యారు. వీటన్నింటిపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలి. వన్ బై వన్ మీ ముందుకు తీసుకువస్తాను అని కేఏ పాల్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తా
రేవంత్ రెడ్డిని బెస్ట్ సీఎం చేద్దాం ఓట్లు వేయమని మీ అందరికీ చెప్పాను. కానీ ఇప్పుడాయన వరెస్ట్ సీఎం అయ్యారు. ఈ రెండేండ్లలో ఆయన చేసిన అవినీతిని చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు రూ. 400 కోట్లు ఖర్చు పెట్టి గ్లోబల్ సమ్మిట్ పేరిట అడ్డగోలుగా ప్రజాధనం వృథా చేస్తున్నాడు. ఈ సమ్మిట్‌కు ఇతర దేశాల ప్రతినిధులు రావడం లేదు. ఇండియాను దోచుకున్న వారు వస్తున్నారు. ఇటీవల HILT స్కాం మీద కోర్టులో కేసు వేశాను. త్వరలో అన్ని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వంపై మరో 17 కేసులు వేస్తాను. ఆయన మార్పు చెందితే అభివృద్ధి చేద్దాం. మార్పు చెందకపోతే ఉద్యమిద్దాం అని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



