Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో నేటితో ముగియనున్న ప్రభాకర్‌రావు కస్టడీ
Phone Tapping | తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తీవ్ర రాజకీయ వివాదాలు రేపిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్ పోలీసు కస్టడీలో ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) (SIB) మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి ప్రభాకర్‌రావు (Prabhakar Rao) కస్టడీ నేటితో ముగియనుంది.
ఇప్పటికే పలువురిని విచారించిన సిట్
Phone Tapping | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కస్టోడియల్ విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) (SIB) మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ (IPS) అధికారి టి. ప్రభాకర్‌రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ నేటితో ముగియనుంది. తాజాగా సిట్ (SIT) బృందం టాస్క్‌ఫోర్స్ (Task Force) మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావును విచారిస్తోంది. రెండు రోజుల క్రితమే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, ప్రభాకర్‌రావులను కలిపి విచారించింది. ప్రభాకర్‌రావు పెద్ద కుమారుడు నిశాంత్‌రావును సైతం సిట్ విచారణ జరిపి, ఆయన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించి, స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ప్రణీత్‌రావు మినహా మిగిలిన నిందితులను సిట్ విచారిస్తోంది.
ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను పెండింగ్‌లో పెడుతూనే మే 29న ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ప్రభాకర్‌రావును అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. 12న ఉదయం 11 గంటల కల్లా కేసు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ఆదేశించింది. కస్టడీ విచారణ సమయంలో భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలని దర్యాప్తు సంస్థకు స్పష్టం చేసింది. అతనికి అవసరమైన మందులు, కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని సూచించింది. న్యాయస్థానం ఆదేశంతో 12న ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆయన లొంగిపోయారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ (Telangana)లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఈ నెల 19న మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు కస్టడీని మరో వారం పొడగించింది. ఆయనను డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయాలని సిట్ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని నిర్దేశించింది.
మరోవైపు ఈ కేసులో త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మరో ఇద్దరు మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హరీశ్‌రావు (Harish Rao) లకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఈ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే లీకులిచ్చింది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



