త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రిగే ప్రాంతాల్లో హెచ్చ‌రిక సూచిక‌లు: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలు పెర‌గ‌డంపై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ఆందోళనవ్య‌క్తం చేశారు.

G

Telangana | Published On May 2, 2026, 10.44 am IST

Ponnam Prabhakar | రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రిగే ప్రాంతాల్లో హెచ్చ‌రిక సూచిక‌లు: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాదాలు పెర‌గ‌డంపై మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ఆందోళనవ్య‌క్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించ‌డంలో భాగంగా రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో, ప్రత్యేకంగా కేటాయించిన వేదికలపై, ప్రమాదానికి గురైన వాహనాలను హెచ్చరిక సూచికలతో ప్రదర్శించాలని ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌ను ఆదేశించారు.

ఇది డ్రైవర్లకు, ప్రయాణికులకు యాక్సిడెంట్స్ స్పాట్ దగ్గరగా, హెచ్చరికగా పనిచేస్తుంద‌న్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించి, ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని అభిప్రాయ‌ప‌డ్డారు. అమూల్యమైన ప్రజల ప్రాణాలను కాపాడటానికి, పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవాల‌ని సూంచించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జ‌రుగుతున్న ప్రదేశాలలో అలాంటి డిస్‌ప్లేలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement
Advertisement