Ponnam Prabhakar | మోదీ అన్నప్పుడే అనుమానమొచ్చింది.. పెట్రో ధరలు పెరుగుతాయని..: పొన్నం
Ponnam Prabhakar | మూడు రోజుల క్రితం హైదరాబాద్ (Hyderabad) పర్యటనలో ప్రధాని మోదీ (PM Modi) పెట్రోల్, డీజిల్ తక్కువ వాడండి.. బంగారం కొనొద్దు, నూనె తక్కువ వాడాలి అన్నప్పుడే తమకు అనుమానం వచ్చిందని, చమురు ధరలు పెంచి నడ్డి విరవబోతున్నారని అనుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పెట్రోల్ ధరలపై బీజేపీ నేతలు స్పందించి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
- ఐదు రాష్ట్రాల ఎన్నికలైపోగానే ప్రజల నడ్డి విరిచారు
- యుద్ధాన్ని కారణంగా చూపడం సరికాదు
- బీజేపీ నేతలు బాధ్యత వహిస్తూ ముక్కు నేలకు రాయాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: మూడు రోజుల క్రితం హైదరాబాద్ (Hyderabad) పర్యటనలో ప్రధాని మోదీ (PM Modi) పెట్రోల్, డీజిల్ తక్కువ వాడండి.. బంగారం కొనొద్దు, నూనె తక్కువ వాడాలి అన్నప్పుడే తమకు అనుమానం వచ్చిందని, చమురు ధరలు పెంచి నడ్డి విరవబోతున్నారని అనుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు నెలల స్టాక్ ఉందని చెప్పారని, యుద్ధాన్ని కారణంగా చూపడం సరికాదన్నారు. పెట్రోల్ ధరలపై బీజేపీ నేతలు స్పందించి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రజలను మోసం చేసింది..
ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసింది. దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ ఊహించిన విధంగా పెట్రోల్ డీజిల్ పెంచకుండా ఆపారు. ఎన్నికలు పూర్తి కాగానే ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా కాకముందే దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ ధరలు పెంచి మరోసారి అన్యాయం చేసింది అని పొన్నం మండిపడ్డారు.
యూపీఏ నయా పైసా పెంచకముందే మాట్లాడేటోళ్లు..
కిషన్ రెడ్డి, బండి సంజయ్ పెట్రోల్ ధరలు పెరగవని చాలాసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి చెప్పారు. కానీ నరేంద్ర మోదీయేమో పెట్రోల్ ధరలు పెంచారు. గతంలో యూపీఏ ప్రభుత్వం నయా పైసా పెంచక ముందే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తుండేవారు అని మంత్రి ఫైరయ్యారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ పర్యటన లో పెట్రోల్, డీజిల్ తక్కువ వాడండి బంగారం కొనవద్దు, నూనె తక్కువ వాడాలి అన్నప్పుడే అనుమానం వచ్చింది. ఆరు నెలల స్టాక్ ఉందని చెప్పారు. యుద్ధం కారణం చూపుతున్నారు. యుద్ధం ఈరోజు రాలేదు. ఇప్పటి నుండో ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి వ్యతిరేకిస్తున్నాం. పెట్రోల్ ధరలపై బీజేపీ నేతలు స్పందించి ముక్కు నేలకు రాయాలి అని పొన్నం డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



