Ponnam Prabhakar | కరీంనగర్ మేయర్ రేసులో కాంగ్రెస్.. కార్పొరేషన్‌ను దక్కించుకుంటామన్న మంత్రి పొన్నం
Ponnam Prabhakar | కరీంనగర్ మేయర్ రేసులో తామూ ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌ను (Karimnagar Corporation) దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: కరీంనగర్ మేయర్ రేసులో తామూ ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌ను (Karimnagar Corporation) దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఏ విధానాన్ని అనుసరిస్తారో తామూ అదే చేస్తామని స్పష్టం చేశారు. వేములవాడ రాజరాజేశ్వరునికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో మేయర్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారన్నారు. పూర్తి మెజార్టీ లేకపోవడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారన్నారు. మరి కరీంనగర్‌లో మెజార్టీ లేకున్నా మేయర్ పీఠం దక్కించుకుంటామని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎలా చెబుతారని ప్రశ్నించారు
కార్పొరేషన్లలో ప్రజాస్వామ్యబద్ధంగా మేయర్‌ను ఎన్నుకుంటారని తెలిపారు. అందరినీ కలుపుకొని మేయర్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పారు. బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో తామూ అలాగే చేస్తామన్నారు. మేయర్, చైర్‌పర్సన్ పీఠాల కోసం క్యాంపు రాజకీయాలు ఉంటాయని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేశారు.
కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా బీజేపీ 30 స్థానాలు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌కు 14, బీఆర్‌ఎస్‌కు 9, ఎంఐఎంకు మూడు దక్కగా 10 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇక్కడ మేయర్‌ను సాధించాలంటే 35 మంది సభ్యుల మద్దతు కావాలి. స్వతంత్ర అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



