Ponnam Prabhakar | మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం: మంత్రి పొన్నం
Ponnam Prabhakar | తెలంగాణ పీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్‌ను (Rajya sabha Nomination) తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ పీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్‌ను (Rajya sabha Nomination) తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా, ఏ కేసులోనూ హాజరు కాకుండా, తనపై అసలు కేసు ఉందనే విషయమే తెలియని పరిస్థితుల్లో ఎన్నికల అఫిడవిట్‌లో ఆ కేసు గురించి పేర్కొనలేదని విమర్శించారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగానే ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో ఆమె నామినేషన్‌ను తిరస్కరించిందని ధ్వజమెత్తారు.
గాంధేయవాదిగా, చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం పట్ల అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి మీనాక్షి నటరాజన్ అని చెప్పారు. ఒక సుశిక్షితురాలైన కాంగ్రెస్ కార్యకర్తగా, ఎన్‌ఎస్‌యూఐ నాయకురాలిగా ఎదిగిన ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం తీవ్రమైన రాజకీయ అప్రజాస్వామ్య చర్య అని మండిపడ్డారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే, మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పే, `బేటీ బచావో- బేటీ పఢావో` అని నినదించే బీజేపీ, ఒక మహిళా నాయకురాలి నామినేషన్‌ను ఇలా తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని చెప్పారు.
ఈ విషయంలో న్యాయస్థానాలు వెంటనే స్పందించి, పూర్తిస్థాయి విచారణ జరిపి, ఆమె నామినేషన్‌ను తిరిగి పరిశీలనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాజకీయ క్రీడలో బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ నిరంకుశంగా, క్రూరంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయి. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త మైలురాయి.. సుందర్బన్ అడవుల్లో హరిత వికాసం
- ●Samyuktha | విజయ్ సేతుపతి యాక్టింగ్‌ను లైవ్‌లో చూడడం ప్రత్యేక అనుభవం : సంయుక్త
- ●Bharathiraja | తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూత..
- ●PM KISAN | జూలైలో పీఎం కిసాన్ నిధులు.. ఈనెల 30లోపు ఈ-కేవేసీ పూర్తిచేస్తేనే!
- ●Tuition Fees | ఇకపై ఒకేసారి ట్యూషన్ ఫీజుల విడుదల.. ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకోవచ్చు!
- ●ENC Mohan Naik | ఆ ఈఎన్సీ ఇంట్లో రూ.200 కోట్లు.. 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి..

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త మైలురాయి.. సుందర్బన్ అడవుల్లో హరిత వికాసం

Samyuktha | విజయ్ సేతుపతి యాక్టింగ్‌ను లైవ్‌లో చూడడం ప్రత్యేక అనుభవం : సంయుక్త

Bharathiraja | తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూత..

PM KISAN | జూలైలో పీఎం కిసాన్ నిధులు.. ఈనెల 30లోపు ఈ-కేవేసీ పూర్తిచేస్తేనే!





