త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Muharram | మొహర్రం వేడుక‌ల‌కు విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్

Muharram | ఈ నెల 16న జరగనున్న మొహర్రం ఊరేగింపు కార్య‌క్ర‌మానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

P

Hyderabad | Published On Jun 9, 2026, 8.55 pm IST

Muharram | మొహర్రం వేడుక‌ల‌కు విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
Advertisement

Muharram | ఈ నెల 16న జరగనున్న మొహర్రం ఊరేగింపు కార్య‌క్ర‌మానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో పాటు వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆశుర్ ఖానాల వద్ద అవసరమైన పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని, పరిసర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజ్, రోడ్డు మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే అన్ని చోట్ల హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

విద్యుత్ శాఖ ప్రత్యేక దీపాల ఏర్పాటు చేయాలని, తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా వాటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని, అవసరమైన చోట మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆర్‌అండ్‌బీ అధికారులు బారికేడింగ్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. మొహర్రం ఊరేగింపు సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ప్రధాన ఊరేగింపు ప్రారంభమయ్యే బీబీ-కా-ఆలం పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆషుర్ ఖానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మొహర్రం ఊరేగింపు సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement