Samyuktha | విజయ్ సేతుపతి యాక్టింగ్‌ను లైవ్‌లో చూడడం ప్రత్యేక అనుభవం : సంయుక్త
Samyuktha | మలయాళీ బ్యూటీ సంయుక్త తమిళ స్టార్ నటుడు నటుడు విజయ్ సేతుపతిపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయనతో కలిసి నటించే అవకాశం తనకు ఎంతో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని చెప్పింది. త్వరలో పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న స్లమ్‌డాగ్-33 టెంపుల్ రోడ్ మూవీలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నది.
Entertainment | Published On Jun 10, 2026, 9.20 am IST
Samyuktha | మలయాళీ బ్యూటీ సంయుక్త తమిళ స్టార్ నటుడు నటుడు విజయ్ సేతుపతిపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయనతో కలిసి నటించే అవకాశం తనకు ఎంతో ప్రత్యేక అనుభూతిని కలిగించిందని చెప్పింది. త్వరలో పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న స్లమ్‌డాగ్-33 టెంపుల్ రోడ్ మూవీలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సందర్భంగా సంయుక్త మాట్లాడుతూ.. తెరపై కనిపించే నటనకంటే ప్రత్యక్షంగా ఆయన పాత్రలోకి వెళ్లే తీరు మరింత అద్భుతంగా ఉంటుందని చెప్పింది. “నేను విజయ్ సర్‌కు పెద్ద అభిమానిని. ఆయన నటనను ప్రత్యక్షంగా చూడడం పూర్తిగా భిన్నమైన అనుభవం. ఒక పాత్రలోకి ఆయన చాలా సహజంగా ఒదిగిపోతారు. డైలాగ్స్ చెప్పే సమయంలో అవి నిజంగా ఆయన మనసులో నుంచి వచ్చినట్లే అనిపిస్తాయి. సహనటిగా దగ్గర నుంచి చూడడం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపించింది” అని సంయుక్త పేర్కొంది.
‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రంలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇప్పటివరకు తాను చేయని భిన్నమైన పాత్ర ఇది అని, పాత్రలో విభిన్న కోణాలు, భావోద్వేగాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపింది. “ఈ సినిమాలో నా పాత్ర చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి పాత్రను నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. ఇందులో ఒకదానికొకటి విరుద్ధమైన లక్షణాలు ఉన్నా.. అవే పాత్రకు ప్రత్యేకతను తీసుకువస్తాయి. నటిగా నన్ను సవాల్ చేసిన పాత్ర ఇది. ఇలాంటి పాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది” అని సంయుక్త చెప్పుకొచ్చింది.
దర్శకుడు పూరి జగన్నాథ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన దర్శకత్వ శైలి ఎంతో ప్రత్యేకంగా, స్టైలిష్‌గా ఉంటుందని చెప్పింది. సెట్స్‌లో ఆయన చూపించే క్రమశిక్షణ తనను ఆకట్టుకుందని చెప్పింది. “ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుందని అందరూ చెబుతుండేవారు. సెట్స్‌లోకి వెళ్లాక ఎందుకో అర్థమైంది. పూరి సర్ దర్శకత్వం చాలా సులభంగా కనిపించినా.. అందులో ప్రత్యేకమైన అందం ఉంటుంది. చాలామంది ఆయన షూటింగ్‌లను సమయానికి పూర్తి చేస్తారని అంటారు. కానీ నేను చెప్పేదేమిటంటే, ఆయన సమయానికి ప్రారంభించడమే కాదు, అనుకున్న దానికంటే ముందుగానే పూర్తి చేస్తారు. ఆయన పని తీరు చూడటం నిజంగా అద్భుతం” అంటూ చెప్పుకొచ్చింది. ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ చిత్రం ఈ నెల 19న విడదుల కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
సంబంధిత వార్తలు

Union Minister Kishan Reddy | నీలా హాజరు వేయించుకునే వ్యక్తిని కాదు.. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కిషన్‌రెడ్డి కౌంటర్..!
జూన్ 9, 2026

Muharram | మొహర్రం వేడుకలకు విస్తృత ఏర్పాట్లు : మంత్రి పొన్నం ప్రభాకర్
జూన్ 9, 2026

Minister Adluri Laxman Kumar | హిట్లర్ ఎవరో.. హితుడు ఎవరో తెలుసుకో.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి బహిరంగ లేఖ
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త మైలురాయి.. సుందర్బన్ అడవుల్లో హరిత వికాసం
- ●Bharathiraja | తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూత..
- ●PM KISAN | జూలైలో పీఎం కిసాన్ నిధులు.. ఈనెల 30లోపు ఈ-కేవేసీ పూర్తిచేస్తేనే!
- ●Ponnam Prabhakar | మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం: మంత్రి పొన్నం
- ●Tuition Fees | ఇకపై ఒకేసారి ట్యూషన్ ఫీజుల విడుదల.. ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకోవచ్చు!
- ●ENC Mohan Naik | ఆ ఈఎన్సీ ఇంట్లో రూ.200 కోట్లు.. 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి..

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త మైలురాయి.. సుందర్బన్ అడవుల్లో హరిత వికాసం

Bharathiraja | తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూత..

PM KISAN | జూలైలో పీఎం కిసాన్ నిధులు.. ఈనెల 30లోపు ఈ-కేవేసీ పూర్తిచేస్తేనే!

Ponnam Prabhakar | మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం: మంత్రి పొన్నం



