Tuition Fees | ఇకపై ఒకేసారి ట్యూషన్ ఫీజుల విడుదల.. ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకోవచ్చు!
Tuition Fees | విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై ఏడాది ట్యూషన్ ఫీజులను (Tuition Fees) ఒకేసారి విడుదల చేయనున్నారు. అదేవిధంగా ఏదాడి పొడవునా ట్యూషన్ ఫీజులు, స్కాలర్ షిప్ (Scholorship) ముంజూరుకు ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకోవచ్చు.
Tuition Fees | త్రినేత్ర.న్యూస్: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై ఏడాది ట్యూషన్ ఫీజులను (Tuition Fees) ఒకేసారి విడుదల చేయనున్నారు. అదేవిధంగా ఏదాడి పొడవునా ట్యూషన్ ఫీజులు, స్కాలర్ షిప్ (Scholorship) ముంజూరుకు ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆలస్యమైనకొద్దీ ఫీజుల విడుదల ఆలస్యం కానుంది. ముందు దరఖాస్తుచేసిన వారికి ప్రభుత్వం ముందుగానే ఫిజులు మంజూరు చేయనుంది. ఈ మేరకు ఏడాది ఫీజు ఒకేసారి చెల్లించేలా ప్రభుత్వం బోధన రుసుముల నిబంధనలు జారీచేసింది.
ట్యూషన్ ఫీజుల చెల్లింపులపై గతంలో విడుదల చేసిన జీవో నం.7ను రద్దు చేసింది. కొత్త నిబంధనలతో బోధన ఫీజుల నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమశాఖ ఉత్తర్వులు (జీవో నం.9) జారీ చేసింది. ఈ నిబంధనలు 2026-27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు తాజా, రెన్యువల్ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఏడాదంతా దరఖాస్తుకు పోర్టల్ తెరిచే ఉంటుంది.
నేరుగా విద్యార్థుల ఖాతాకే..
ఈ ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజుల మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) కింద నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం జమచేయనుంది. ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కార్‌షిప్‌లను వారి ఖాతాల్లో జమచేస్తున్నది. ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయనుంది. ఈ మేరకు చెల్లింపుల షెడ్యూలును కూడా ప్రకటించింది. ఫీజులను విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేసిన వారం రోజుల్లో వాటిని కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లించకుంటే ఆ విద్యార్థి నుంచి చట్టంలోని నిబంధనల కింద రికవరీ చేయనుంది. మరోవైపు 2026-27 నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇక ఆటోమేటిక్ రెన్యువల్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఈ ఏడాది చేరినవారు వచ్చేఏడాదికి రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు.
నిధుల విడుదల ఇలా..
ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అందిన దరఖాస్తులను పరిశీలించి.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర వాటాను ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం విడుదల చేయనుంది. కేంద్రం వాటా విడుదల చేసిన వెంటనే ఆ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాలో జమ చేస్తుంది.
- బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు- ఆగస్టు 15న
- ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు- డిసెంబర్ 30 నాటికి
- డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు- ఫిబ్రవరి 28న
- ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు- 75 రోజుల్లోగా
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త మైలురాయి.. సుందర్బన్ అడవుల్లో హరిత వికాసం
- ●Samyuktha | విజయ్ సేతుపతి యాక్టింగ్‌ను లైవ్‌లో చూడడం ప్రత్యేక అనుభవం : సంయుక్త
- ●Bharathiraja | తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూత..
- ●PM KISAN | జూలైలో పీఎం కిసాన్ నిధులు.. ఈనెల 30లోపు ఈ-కేవేసీ పూర్తిచేస్తేనే!
- ●Ponnam Prabhakar | మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం: మంత్రి పొన్నం
- ●ENC Mohan Naik | ఆ ఈఎన్సీ ఇంట్లో రూ.200 కోట్లు.. 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి..

Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త మైలురాయి.. సుందర్బన్ అడవుల్లో హరిత వికాసం

Samyuktha | విజయ్ సేతుపతి యాక్టింగ్‌ను లైవ్‌లో చూడడం ప్రత్యేక అనుభవం : సంయుక్త

Bharathiraja | తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూత..

PM KISAN | జూలైలో పీఎం కిసాన్ నిధులు.. ఈనెల 30లోపు ఈ-కేవేసీ పూర్తిచేస్తేనే!




