త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | ప్ర‌జ‌లంతా సెల్ఫ్ ఎన్ముమ‌రేష‌న్ చేసుకోవాలి: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

Ponnam Prabhakar | జ‌న‌గ‌ణ‌న‌లో భాగంగా (Census) మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్‌లో సెల్ఫ్ ఎన్యుమ‌రేష‌న్‌ను (Self Enumeration) మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. అధికారుల సమక్షంలో స్వీయ‌గ‌ణ‌న చేసుసుకున్నారు.

G

Telangana | Published On Apr 26, 2026, 11.39 am IST

Ponnam Prabhakar | ప్ర‌జ‌లంతా సెల్ఫ్ ఎన్ముమ‌రేష‌న్ చేసుకోవాలి: మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర‌.న్యూస్‌: జ‌న‌గ‌ణ‌న‌లో భాగంగా (Census) మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్‌లో సెల్ఫ్ ఎన్యుమ‌రేష‌న్‌ను (Self Enumeration) మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. అధికారుల సమక్షంలో స్వీయ‌గ‌ణ‌న చేసుసుకున్నారు. అనంత‌రం మాట్లాడుతూ.. ప్రజలంతా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలని సూచించారు. దేశ‌వ్యాప్తంగా జాతీయ జ‌న‌గ‌ణ‌న ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ (Telangana) లోనూ జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ‌ ప్రారంభ‌మ‌వుతుండ‌టంతో ప్ర‌తి పౌరుడు సెల్ఫ్ ఎన్యుమ‌రేష‌న్ చేసుకోవ‌డంతో త‌మ కుటుంబ వివ‌రాలను దేశ జ‌నాభా లెక్క‌ల్లో చూపెట్టాల‌ని తెలిపారు.

ప్రజాస్వామ్య విధానంలో ఎవరు, ఎంత, ఏమిటి.. అనేదానిపై జనాభా లెక్కలు 2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ జాప్యం జరగకుండా దేశంలోనే తెలంగాణ పారదర్శకంగా నంబర్ 1గా ఉండేలా ప్ర‌జ‌లు త‌మ వివ‌రాల‌ను స్వీయ గ‌ణ‌న చేసుకోవాల‌ని కోరారు.

ప్రతి పౌరుడు విధిగా పాల్గొనాలి: గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 2026-2027 జనాభా లెక్కల నమోదు కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అధికారులకు తనతోపాటు కుటుంబ సభ్యుల వివరాలను అందజేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వాన్, డిప్యూటీ కమిషనర్ ఎన్. శంకర్ వారి వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

ఈ సందర్భంగా మండ‌లి చైర్మ‌న్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు విధిగా జనాభా లెక్కల నమోదు కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. వివరాలను నమోదు చేయడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించినట్ల‌వుతుంద‌ని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన‌ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆన్‌లైన్ ద్వారా నేరుగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, అలాంటి అవకాశం లేని వారి ఇంటికి అధికారులు వచ్చి వివరాలు సేకరిస్తార‌న్నారు. అధికారులు తమ కర్తవ్యాన్ని బాధ్యతయుతంగా నిర్వహించి 2027 జనాభా లెక్కల నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని సూచించారు.

Advertisement
Advertisement