త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Diversions | సంక్రాంతి ట్రాఫిక్ ర‌ద్దీ నివార‌ణ‌కు పోలీసుల ప్ర‌త్యేక చ‌ర్య‌లు.. న‌గ‌రానికి వ‌చ్చే వాహ‌నాల దారి మ‌ళ్లింపు

Traffic Diversions | సంక్రాంతి (Sankranthi) పండుగ ముగిసిన అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) నుంచి హైద‌రాబాద్‌ (Hyderabad)కు తిరుగు ప్ర‌యాణాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ట్రాఫిక్ రద్దీ నివార‌ణ‌కు పోలీసులు (Police) ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నారు. 65వ నెంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై హైద‌రాబాద్‌కు వ‌చ్చే వాహ‌నాలను దారి మ‌ళ్లించ‌నున్న‌ట్లు (Traffic Diversions) పోలీసులు తెలిపారు.

A

Telangana | Published On Jan 17, 2026, 2.33 pm IST

Traffic Diversions | సంక్రాంతి ట్రాఫిక్ ర‌ద్దీ నివార‌ణ‌కు పోలీసుల ప్ర‌త్యేక చ‌ర్య‌లు.. న‌గ‌రానికి వ‌చ్చే వాహ‌నాల దారి మ‌ళ్లింపు
Advertisement

Traffic Diversions | సంక్రాంతి (Sankranthi) పండుగ ముగిసిన అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) నుంచి హైద‌రాబాద్‌ (Hyderabad)కు తిరుగు ప్ర‌యాణాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ట్రాఫిక్ రద్దీ నివార‌ణ‌కు పోలీసులు (Police) ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నారు. 65వ నెంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై హైద‌రాబాద్‌కు వ‌చ్చే వాహ‌నాలను దారి మ‌ళ్లించ‌నున్న‌ట్లు (Traffic Diversions) పోలీసులు తెలిపారు. ఈ మేర‌కు వాహ‌న‌దారుల‌కు సూచ‌న‌లు చేశారు. హైవేపై చిట్యాల‌, పెద్ద కాప‌ర్తి ద‌గ్గ‌ర ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నుల‌తో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతోంద‌ని చెప్పారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

ప్ర‌త్యామ్నాయ మార్గాలివే...

1.గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు.
(గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్..)

2.మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు..
(మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్..)

3.నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు..
(నల్లగొండ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్..)

4.విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు..
(కోదాడ- హుజూర్నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్..)

5. జాతీయ రహదారిపై.. చిట్యాల, పెద్దకాపర్తిలో ఫ్లైఓవ‌ర్ నిర్మాణాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే..
(చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైద్రాబాద్ మళ్లించేలా ఏర్పాట్లు..)

Advertisement

తాజావార్తలు

Advertisement