AR Rahman | మళ్లీ హిందుమతంలో చేరండి.. ఏఆర్ రెహమాన్‌కు వీహెచ్‌పీ కౌంటర్..
AR Rahman | ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతున్నది. బాలీవుడ్‌లో సినిమా అవకాశాలు తగ్గడానికి తన మతం కూడా ఓ కారణమంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మరాయి. మ్యూజిక్ డైరెక్టర్‌పై విశ్వహిందు పరిషత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నేతలకు సరిపోతాయో కానీ.. కళాకారులకు తగవంటూ వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ వ్యాఖ్యానించారు.
Entertainment | Published On Jan 17, 2026, 4.26 pm IST
AR Rahman | ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (VHP) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఆయన తిరిగి హిందూ మతంలోకి మారితే మంచిదని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బల్సన్ వ్యాఖ్యానించారు. బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయన్నారు. ఇందుకు ఇండస్ట్రీలో మారిన పవర్ షిఫ్ట్ ఒక కారణమైతే.. తన మతం మరో కారణమై ఉండచ్చవన్నారు. ఈ విషయాన్ని తనకు ఎవరూ చెప్పకపోయినా పుకార్ల రూపంలో మాత్రం తెలిసిందని రెహమాన్ వ్యాఖ్యానించారు.
అయితే, వినోద్ బన్సల్ మాట్లాడుతూ రెహమాన్ ఓ వర్గంతో చేతులు కలిపారని ఆరోపించారు. గతంలో మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ నాయకత్వం వహించిన వర్గానికి రెహమాన్ నాయకుడిగా మారినట్లుగా అనిపిస్తోందని విమర్శించారు. అన్సారీ పదేళ్లు ఎన్నో ప్రయోజనాలను పొంది, రాజ్యాంగబద్దమైన పదువుల్లో కొనసాగరని బన్సల్ పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత ఆయన భారత్‌ను కించపరిచారని విమర్శించారు. రెహమాన్‌ను భారతీయులంతా ఆదరించారన్నారు. కానీ, తనకు ఎందుకు ప్రస్తుతం పని దొరకడం లేదో ఆత్మ పరిశీలన చేసుకోకుండా.. వ్యవస్థను విమర్శిస్తూ ఇండస్ట్రీని అపఖ్యాతి పాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకప్పుడు ఆయన హిందువేనని.. ఆయన ఇస్లాంలోకి ఎందుకు మారారు. ఇప్పడు తిరిగి హిందూ మతంలోకి చేరితో మళ్లీ పని దొరుకుతుందని ఆయన వ్యాఖ్యనించారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నాయకులకు సరిపోతాయేమో కానీ ఓ కళాకారుడికి మాత్రం తగవన్నారు.
ఇదిలా ఉండగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు రెహమాన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ మాట్లాడుతూ హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదన్నారు. దిలీప్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి ఎందరో అగ్రస్థానంలో ఉన్నారన్నారు. మరో ప్రముఖ నిర్మాత సైతం రెహమాన్ వ్యాఖ్యలను చౌకబారు వ్యాఖ్యలంటూ మండిపడ్డారు. సంగీతంలో క్వాలిటీ లేకపోవడం, ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆలస్యంగా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాలు తప్పా మరే కారణం లేదన్నారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



