KTR | తుగ్లక్ అంటే ఎలా ఉంటాడో.. రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు: కేటీఆర్
KTR | తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసినందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ తల్లిలో బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టినందుకు, తెలంగాణ రాజముద్రను మార్చినందుకు ప్రజలు మిమ్మల్ని క్షమించరంటూ మండిపడ్డారు.
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసినందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ తల్లిలో బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టినందుకు, తెలంగాణ రాజముద్రను మార్చినందుకు ప్రజలు మిమ్మల్ని క్షమించరంటూ మండిపడ్డారు. తుగ్లక్ పాలన, తుగ్లక్ అంటే ఎట్లా ఉంటాడో రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో రెండేండ్లుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదని, తన విధ్వంస ప్రణాళికలతో ముందుకు పోతున్నాడని ధ్వజమెత్తారు. జోకర్లను ఎన్నుకుంటే సర్కస్ నడిపిస్తారు అనేది తెలంగాణలో కనిపిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. `చారిత్రకంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా, ఒక పెద్ద నగరంగా విస్తరించాయి. ఈ రెండు నగరాలు ప్రపంచవ్యాప్తంగా జంట నగరాలుగా పేరుపొందాయి. గతంలో పుస్తకాల్లో చదువుకున్న తుగ్లక్ గురించి ఈరోజు అందరికీ కనిపిస్తున్నది. తుగ్లక్ పాలన తుగ్లక్ అంటే ఎట్లా ఉంటాడో రేవంత్ రెడ్డిని చూసి అర్థం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చావు. ఆ హామీల ఆమలును పక్కనపెట్టి కేవలం పేర్లు మార్చడం పైన ఫోకస్ పెట్టావు. మొదట టీఎస్ తీసేసి టీజీ అన్నారు. తర్వాత తెలంగాణ తల్లిని మార్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తీసేశారు, అధికార చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్‌ను తొలగించారు. వీటన్నిటి వల్ల ప్రజలకి ఏమాత్రం లాభం జరిగిందో ప్రభుత్వం చెప్పాలి. ఇలాంటి పిచ్చి పనులు, తుగ్లక్ పనులు తప్పించి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు.
ప్రజల దగ్గరికి పాలన పోవాలని అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని వీకేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ప్రారంభించారు. కొత్త గ్రామాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను ఏర్పాటు చేశారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారు. హైదరాబాద్ మహానగరంలో గతంలో 24 సర్కిళ్లు ఉంటే 30 సర్కిళ్లుగా, 4 జోన్లను 6 జోన్లుగా చేసుకున్నాం. ఇన్ని చేసినా కూడా హైదరాబాద్ అస్తిత్వాన్ని తాము ఎప్పడు ముట్టుకోలేదు. అలాంటిది ఇవాళ తుగ్లక్ ముఖ్యమంత్రి సికింద్రాబాద్‌ను శాశ్వతంగా ఐడెంటిటీ లేకుండా చేస్తున్నాడు.
తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వ చిహ్నాలు..
హైదరాబాద్, సికింద్రాబాద్ అనేవి తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వ చిహ్నాలు. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లక్ నిర్ణయం వల్ల సికింద్రాబాద్‌కు ఉన్న చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉన్నది. దాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అంతా కలిసి ఒక శాంతి ర్యాలీ తీస్తూ దానికి మమ్మల్ని ఆహ్వానించారు.
అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం మా పార్టీకి చెందిన వారే. సికింద్రాబాద్‌లో పుట్టిన బిడ్డలుగా ఇక్కడి అస్తిత్వాన్ని కాపాడాలి అని…సికింద్రాబాద్ ప్రజలు పోరాటం చేస్తున్నారు. అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను, ప్రజల అస్తిత్వాలను గుర్తు లేకుండా చేరుపడం కోసం కాదు. అధికారం ఇచ్చింది గ్యారెంటీలను అమలు చేయడానికి, ప్రజలకు మంచి చేయాలని. కానీ ఇలాంటి ఒక్క పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చేయడం లేదు.
రెండేండ్లుగా ఒక్క ఇటుక కూడా పెట్టలే..
హైదరాబాద్ నగరంలో రెండేండ్లుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ఒక ఇళ్లూ కట్టలేదు. కానీ నగరం మొత్తం తన విధ్వంసం ప్రణాళికలతో ముందుకు పోతున్నాడు. ఈరోజు శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టారు. ప్రజల కోరిక మేరకు ప్రజాప్రతినిధులని కోరిక మేరకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తామని సిద్ధంగా ఉన్నాం.
కానీ నిన్న రాత్రి వరకు అనుమతి ఉందని చెప్పి, ఇప్పుడు అనుమతి లేదని చెప్పి వేలాది మందిని, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు, సాధారణ ప్రజలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. ఇంత అరాచకంగా అక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి.
జిల్లాగా సికింద్రాబాద్..
ఇప్పుడున్న పదవిలో ఎల్లకాలం కొనసాగనన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చేరిపేసే ప్రయత్నం మానుకోవాలి. ఈరోజు శాంతి ర్యాలీని భగ్నం చేశామని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందవచ్చు. కానీ ఇది తాత్కాలికం మాత్రమే. రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే మా హక్కును కచ్చితంగా ఉపయోగించుకుంటూ మరోసారి కోర్టుకు వెళ్లి శాంతి ర్యాలీని నిర్వహించుకుంటాం. కేవలం శాంతి ర్యాలీ మాత్రమే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలతో సికింద్రాబాద్ ప్రజల పోరాటానికి అండగా ఉంటాం.
మరోసారి తిరిగి ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సికింద్రాబాద్‌ను మరొక జిల్లాగా మారుస్తుంది. ప్రజల ఆకాంక్షల మేరకు వారి డిమాండ్లన్నింటిని రాబోయే మా ప్రభుత్వంలో నెరవేర్చుతాం.
రేవంత్ రెడ్డికి ఉన్న నొప్పి ఏమిటో..
ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే దాన్ని ఎవరు నమ్ముతరు. ఎవరు విశ్వసిస్తరు. 10 సంవత్సరాల తర్వాత ఉన్న జిల్లాలను తీసివేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. చిన్న జిల్లాలతో ప్రజల దగ్గరికి అధికారులు వస్తే రేవంత్ రెడ్డికి ఉన్న నొప్పి ఏమిటో అర్థం అవడం లేదు. రాష్ట్రాల సచివాలయం కంటే గొప్పగా కట్టుకున్న సమీకృత కలెక్టరేట్ల ద్వారా ప్రజలకి పాలన అందుతుంటే ముఖ్యమంత్రికి ఏం సమస్య ఉందో అర్థం కావడం లేదు. ఈరోజు వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు వారందరినీ వెంటనే భేషరతుగా విడుదల చేయాలి. ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమే ప్రజాపాలనా?. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపైన రాహుల్ గాంధీ స్పందించాలి. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఆయన గుర్తించాలి. ఇంత దారుణంగా, అక్రమంగా, అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్తిగా అనే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పాలి.
జోకర్లను ఎన్నుకుంటే..
తెలంగాణలో జర్నలిస్టులను ఉగ్రవాదులు, నేరగాళ్ల లాగ అరెస్టులు చేస్తున్నారు. జోకర్లను ఎన్నుకుంటే సర్కస్ నడిపిస్తారు అనేది తెలంగాణలో కనిపిస్తుంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరగడం లేదు. మాటిమాటికి ఇందిరమ్మ రాజ్యం అంటారు, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్టాల్లో అదే నడుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ దృతరాష్ట్రుడిగా మారిపోయారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా, కళ్ళకు గంతలు కట్టుకున్నట్లు నాకు ఆధారాలేం కనబడట్లేవు అని మాట్లాడుతున్నారు.` అని కేటీఆర్ అన్నారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



