Tamannaah | రొమాంటిక్ సీన్ చేయనంటే సినిమా నుంచి తీసేస్తామన్నారు – తమన్నా కామెంట్స్
కెరీర్ ఆరంభంలో ఓ సినిమా షూటింగ్‌లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవంపై తమన్నా (Tamannaah) ఆసక్తికర కామెంట్స్ చేసింది. రొమాంటిక్ సీన్ చేయనని అన్నందుకు తనను సినిమా నుంచి తప్పించడానికి ప్రయత్నించారని ఓ ఇంటర్వ్యూలో తమన్నా కామెంట్స్ చేసింది.
Entertainment | Published On Jan 17, 2026, 4.31 pm IST
Tamannaah | ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఓ హీరోయిన్ ఇరవై ఏళ్లకుపైగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే గొప్పగానే చెప్పవచ్చు. యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ ఇప్పటికీ నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతుందంటే మామూలు విషయం కాదు.ఆ హీరోయిన్ ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah). 2005లో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. గత కొద్ది రోజులుగా తెలుగులో ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్‌లోనే ఎక్కువగా సినిమాలో చేస్తోంది. ఇండస్ట్రీలో తన సినీ ప్రయాణంపై ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని అన్నది.
రొమాంటిక్ సీన్...
"తొలినాళ్లలో ఓ సినిమా షూటింగ్ సమయంలో రొమాంటిక్ సీన్ చేయాల్సివచ్చింది. ఆ సీన్ చేయడం నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. అదే మాట డైరెక్టర్‌తో అన్నాను. ఆ సీన్ చేయనని చెప్పాను. కానీ ఆ డైరెక్టర్ మాత్రం నా మాటలను పెద్దగా పట్టించుకోలేదు. షూటింగ్‌లో అందరి ముందే ఈ హీరోయిన్‌ని మార్చండి అంటూ అరిచాడు అని తమన్నా అన్నది.
అంతే కాకుండా నన్ను ఆ సినిమా నుంచి తప్పించే ప్రయత్నాలు చాలా జరిగాయి. నా అంతట నేను వెళ్లేలా ప్రవర్తించారు. నాపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా నేను తగ్గలేదు. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కోవాలని ఫిక్సయ్యానను. సెట్స్‌లో ఎవరూ నాకు సపోర్ట్ లేకపోవడంతో నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కొద్ది రోజుల తర్వాత నన్ను మార్చేయమని చెప్పిన అదే డైరెక్టర్ వచ్చి క్షమాపణ చెప్పాడు" అని తమన్నా అన్నది. ఆ డైరెక్టర్ ఎవరూ, సినిమా ఏదన్నది మాత్రం తమన్నా రివీల్ చేయలేదు. తమన్నా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తమన్నా స్పెషల్ సాంగ్‌కు వంద కోట్ల వ్యూస్...
ఓ వైపు హీరోయిన్‌గా నటిస్తూనే తమన్నా స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తోంది. గత ఏడాది రిలీజైన బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ స్త్రీ2లో తమన్నా ఐటెంసాంగ్ సాంగ్ చేసింది. ఆజ్ కీ రాత్ అనే ఈ స్పెషల్ సాంగ్ పెద్ద హిట్టయ్యింది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్‌లో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఏకంగా వంద కోట్ల వ్యూస్‌ను సాధించింది. ఈ ఘనతను సాధించిన ఫస్ట్ స్సెషల్ సాంగ్‌గా నిలిచింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



