త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | మే 10న‌ తెలంగాణకు ప్రధాని మోదీ.. ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాపన

PM Modi | ప్ర‌ధాని మోదీ (PM Modi) తెలంగాణ (Telangana) ప‌ర్య‌ట‌న ఖ‌రార‌యింది. ఈ నెల 10న ప్ర‌ధాని రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు.

G

Telangana | Published On Apr 27, 2026, 11.10 am IST

PM Modi | మే 10న‌ తెలంగాణకు ప్రధాని మోదీ.. ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాపన
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్: ప్ర‌ధాని మోదీ (PM Modi) తెలంగాణ (Telangana) ప‌ర్య‌ట‌న ఖ‌రార‌యింది. ఈ నెల 10న ప్ర‌ధాని రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న‌ భారీ బహిరంగ సభకు హాజరవుతారు. అదే వేదికపై నుంచి ప‌లు కీలక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. దీంతో దాదాపు రెండేండ్ల త‌ర్వాత ప్ర‌ధాని మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో రూ.7500 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు. ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన స‌మ్మక్క సార‌క్క సెంట్ర‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేసే అవ‌కాశం ఉంది.

అదేవిధంగా యాదాద్రి వ‌ర‌కు ఎంఎంటీఎస్ రైలు పొడిగింపు ప‌నుల‌కు, వ‌రంగ‌ల్ మామునూరు విమానాశ్ర‌యం అభివృద్ధి ప‌నుల‌కు భూమి పూజ చేసే అవ‌కాశం ఉంది. బీబీన‌గ‌ర్ ఎయిమ్స్‌, కాజీపేట వ‌ర్క్ స్టేష‌న్ త‌దిత‌ర ప‌నుల‌ను ప్రారంభించ‌నున్నారు. ఖమ్మం - దేవరపల్లి మధ్య నిర్మించిన అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిని ప్రధాని ప్రారంభించనున్నారు.

ప‌రేడ్ గ్రౌండ్స్‌లో భారీ స‌భ‌..
సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌భ‌కు ప్ర‌ధాని మోదీ హాజ‌ర‌వుతారు. ఈ సంద‌ర్భంగా తన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూత‌నోత్సాహం నింపడంతో పాటు, తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించనున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు, భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్న‌ది.

Advertisement
Advertisement