Rythu Bharosa | 26న రైతు భరోసా.. మధిరలో నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్
Rythu Bharosa | వానాకాలం (Kharif Season) పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ నెల 26న ఖమ్మం జిల్లా మధిరలో (Madhira) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేయనున్నారు.
Rythu Bharosa | త్రినేత్ర.న్యూస్: వానాకాలం (Kharif Season) పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ నెల 26న ఖమ్మం జిల్లా మధిరలో (Madhira) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలంటూ వ్యవసాయ శాఖ అధికారులు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ప్రతి రైతుకు ఎకరానికి రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. వానాకాలం సాగు కోసం మొత్తం రూ.9 వేల కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమచేయనున్నారు. దీనిపై గురువారం జరుగనున్న అనధికార కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.
రైతుల్లో అసంతృప్తి..
కాగా రైతు భరోసాపై అన్నదాతల్లో అసంతృప్తి నెలకొన్నది. గత వానాకలం వానాకాలం సీజన్లో 69.4 లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్ల నిధులను ప్రభుత్వం అన్నదాతల ఖాతాల్లో వేసింది. అయితే యాసంగి పంట కాలానికి వచ్చేసరికి కేవలం రూ.5,653 కోట్లతోనే సరిపెట్టింది. పంటపెట్టుబడిని రెండు ఎకరాలతోనే సరిపెట్టడం, దశలవారీగా నిధులు విడుదల చేయడం, సాగు గడువు ముగిశాక ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అన్నదాతలకు మేలు జరిగేలా ఈనెల 26న నిధులను ఒకేసారి జమ చేయాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
తాజావార్తలు
- ●Road Accident | మేడ్చల్లో కారు.. లింగాలఘనపూర్లో మినీ ట్రక్కు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం
- ●England vs Croatia | రెచ్చిపోయిన కేన్.. క్రొయేషియాపై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ!
- ●Haier HQLED P7 Pro | హైయర్ నుంచి కొత్త ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు.. ధర తక్కువ, ఏఐ ఫీచర్లు..
- ●Meta AI | ఫేస్బుక్లో మెటా ఏఐ హంగామా.. సెర్చ్ నుంచి వీడియోల వరకు కొత్త ఫీచర్లు..
- ●India-UK | జులై 15 నుంచి భారత్-బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం అమలు
- ●Revanth Reddy | చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా.. చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం: సీఎం రేవంత్ రెడ్డి

Road Accident | మేడ్చల్లో కారు.. లింగాలఘనపూర్లో మినీ ట్రక్కు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం

England vs Croatia | రెచ్చిపోయిన కేన్.. క్రొయేషియాపై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ!

Haier HQLED P7 Pro | హైయర్ నుంచి కొత్త ఎల్ఈడీ స్మార్ట్ టీవీలు.. ధర తక్కువ, ఏఐ ఫీచర్లు..

Meta AI | ఫేస్బుక్లో మెటా ఏఐ హంగామా.. సెర్చ్ నుంచి వీడియోల వరకు కొత్త ఫీచర్లు..






