PM Modi | తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi | తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కోసం కార్యకర్తలు పెద్ద ఎత్తున పెయింటింగ్స్ తీసుకురాగా.. వాటిని సేకరించాలని సెక్యూరిటీకి ప్రధాని ఆదేశించారు.
PM Modi | తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కోసం కార్యకర్తలు పెద్ద ఎత్తున పెయింటింగ్స్ తీసుకురాగా.. వాటిని సేకరించాలని సెక్యూరిటీకి ప్రధాని ఆదేశించారు. పెయింటింగ్స్ వేసిన చిత్రకళాకారులకు లేఖలు రాస్తానని ప్రధాని తెలిపారు. అనంతరం నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా అంటూ మోదీ తెలుగులోనే ప్రసంగం ప్రారంభించారు. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం..
పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారన్నారు. బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని చెప్పారు. ప్రజలు ఈ విజయాన్ని చేకూర్చారన్నారు. బెంగాల్ ప్రజలు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం బీజేపీని గెలిపించుకున్నారని, తెలంగాణ ప్రజల నుంచి అలాంటి ఉత్సాహమే కనిపిస్తోందన్నారు. తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. బెంగాల్ ప్రజలు ఆశీర్వదించినట్లుగానే తెలంగాణలోనూ ఆశీర్వదించాలని కోరారు. బెంగాల్‌లో గెలిచామని, తర్వాత బీజేపీ లక్ష్యం తెలంగాణేనన్నారు. ఇక్కడి కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోందని, తెలంగాణలోనూ అబ్ కీ బార్ మోదీ సర్కార్ నినాదం వినిపిస్తోందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ, ఆ ఫలితంపై ప్రపంచమంతా చర్చ జరిగిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలే..
పశ్చిమ బెంగాల్‌లో ఓడిపోయింది రాజకీయ పార్టీ కాదని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఓడాయాన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలను ప్రజలు ఓడించారని వ్యాఖ్యానించారు. ప్రజల కళ్లలో నాపై ప్రేమ కనిపిస్తోందన్న ప్రధాని.. ఇదంతా తన అదృష్టమని, సౌభాగ్యమన్నారు. దేశం మొత్తం మార్పును కోరుకుంటోందని, ఏ రాష్ట్రంలోనూ కుటుంబ పాలనను ప్రజలు కోరుకోవడం లేదన్నారు. ప్రజలు విశ్వాస పాలనను కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఓడించారన్నారు. ఈ సారి తెలంగాణలోనూ బీజేపీ సర్కార్ వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా కుటుంబ పార్టీలేనన్నారు.
దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక భూమిక
పదేళ్ల కిందట బెంగాల్‌లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, ప్రస్తుతం బెంగాల్‌లో 200 మందికిపైగా సభ్యులతో ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ జెండా ఎత్తేందుకు అవకాశం లేనిచోట కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బీజేపీ ఏర్పాటైన తొలినాళ్లలో రెండు ఎంపీ సీట్లు మాత్రమే గెలిచిందని, ఇందులో ఒకటి తెలంగాణలో విజయం సాధించిందన్నారు. బీజేపీకి అవసరమున్న ప్రతిసారి తెలంగాణ అండగా నిలిచిందని, వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో బీజేపీకి అధికారంలోకి వస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు చూస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే భరోసా కలిగిందన్న ఆయన.. అబ్ కీ బార్ తెలంగాణ అంటూ కార్యకర్తలతో నినాదాలు చేయించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక భూమిక పోషిస్తోందని, రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం వికసిస్తోందన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
తెలంగాణ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు చేశామని, దేశం మొత్తానికి ఏడు పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కులు ఇస్తే.. ఇందులో ఒకటి తెలంగాణకు ఇచ్చామని తెలిపారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌తో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. బీజేపీ దృష్టి ఎప్పుడూ అభివృద్ధి, ఉపాధి మీద మాత్రమే ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించినందుకు కర్నాటక ప్రజలు బాధపడుతున్నారని, తెలంగాణలోనూ కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కాంగ్రెస్ విధానం మొదట ఓట్లు దండుకో.. తర్వాత మర్చిపోవడమేనన్నారు. కాంగ్రెస్ మూడురాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందని, ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా అబద్ధాలతోనే పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. హామీలతో ఆకాశానికి ఎత్తి తర్వాత మోసం చేస్తారన్నారు. కాంగ్రెస్ మావోయిస్ట్ పార్టీగా మారిందని, ముస్లింలీగ్ మావోయిస్ట్ పార్టీగా కాంగ్రెస్ మారిందదన్నారు. కాంగ్రెస్ పొత్తులు ఎప్పుడు అభివృద్ధి నిరోధకులతోనే ఉంటాయని ఆరోపించారు. దేశమంతా మావోయిస్టులు రహితంగా మారిందని, తెలంగాణ సైతం మారుతోందన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



