త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maize | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.. చిన్నారెడ్డి ఆదేశం

Maize | రాష్ట్రంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించేందుకు మార్క్ ఫెడ్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైద్యం డాక్టర్ జీ చిన్నారెడ్డి సూచించారు.

S

Telangana | Published On May 1, 2026, 7.00 pm IST

Maize | మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.. చిన్నారెడ్డి ఆదేశం
Advertisement

బ్యాంకు గ్యారెంటీకి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది
మార్క్ ఫెడ్ తాత్సారం చేయొద్దు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొక్క జొన్న సాగుకు ఆంక్షలెన్నో
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహంతో విరివిగా మొక్క జొన్న సాగు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి

Maize | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించేందుకు మార్క్ ఫెడ్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైద్యం డాక్టర్ జీ చిన్నారెడ్డి సూచించారు. మొక్కజొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ సంస్థకు ఆదేశించి బ్యాంకు గ్యారెంటీకి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చిన్నారెడ్డి తెలిపారు.

క్యాబినెట్ సూచనల మేరకు మార్క్ ఫెడ్ అధికారులు వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చిన్నారెడ్డి సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ప్రోత్సాహాన్ని అందించడంతో మొక్కజొన్న పంట విస్తీర్ణం పెరిగి విరివిగా మొక్క జొన్నలు ఉత్పత్తి అయ్యాయని చిన్నారెడ్డి అన్నారు. మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడంతో రైతులు మద్దతు ధర కన్నా తక్కువగా మార్కెట్ లో మొక్కజొన్నలను అమ్ముకునే దుస్థితి నెలకొందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధరకు తగ్గకుండా మొక్కజొన్న ధర క్వింటాలుకు రూ. 2,400 రైతులకు అందించాలని చిన్నారెడ్డి సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్నల సాగుపై రైతులపై విధించిన ఆంక్షలు వల్ల రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గిందని, మొక్కజొన్నలు పండిస్తే ప్రభుత్వం కొనే సమస్య లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు హెచ్చరించిన విషయాన్ని చిన్నారెడ్డి గుర్తు చేశారు.

ఈ సీజన్ లో పత్తి ఉత్పత్తి గణనీయంగా పెరగడం, పత్తి బేళ్లు భారీగా మార్కెట్‌కు రావడం వల్ల పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను రంగంలోకి దించి పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని చిన్నారెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.

Advertisement
Advertisement