Pig Theft Gang | పందులను ఎత్తుకెళ్తుండగా.. అడ్డుకున్న పోలీసులపై దాడి..
Pig Theft Gang | నారాయణపేట (Narayanpet) జిల్లా కోస్గి (Kosgi)లో పందుల దొంగలు (Pig Theft Gang) హల్‌చల్ చేశారు. పందులను దొంగలించి పారిపోతుండగా అడ్డుకున్న పోలీసులపై దాడి చేసి పరారయ్యారు. దీంతో ఓ హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు.
Pig Theft Gang | త్రినేత్ర.న్యూస్: నారాయణపేట (Narayanpet) జిల్లా కోస్గి (Kosgi)లో పందుల దొంగలు (Pig Theft Gang) హల్‌చల్ చేశారు. పందులను దొంగలించి పారిపోతుండగా అడ్డుకున్న పోలీసులపై దాడి చేసి పరారయ్యారు. దీంతో ఓ హోంగార్డు తీవ్రంగా గాయపడ్డాడు.
అర్ధరాత్రి సమయంలో బొలేరో వాహనంలో పందులను ఎత్తుకెళ్తున్న దుండగులు కోస్గి మీదుగా వెళ్తున్నారు. అయితే పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో వారి వాహనం దారి తప్పింది. ఈ క్రమంలో ఓ ప్రైవేట్ దవాఖాన దగ్గర నూతన భవనానికి రంగులు వేస్తున్న కూలీలను దారి గురించి అడిగారు. అర్ధరాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నారని వారు అడగడంతో కత్తులు చూపించి పరారయ్యారు. ఇదే విషయం పెట్రోలింగ్ పోలీసులు పెయింటర్లు తెలిపారు. దీంతో ఏఎస్సై, మరో ముగ్గురు సిబ్బందితో పెట్రోలింగ్ వాహనంలో, మరో ఇద్దరు బైక్‌పై పట్టణంలో గాలించారు.
బొలేరో బస్టాండ్ ముందుగా వస్తుండటాన్ని గమనించిన పోలీసులు దానిని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో వాహనంలోని ఓ వ్యక్తి బీరు సీసాతో బైక్‌పై ఉన్న హోంగార్డు సురేందర్ తలపై (Attack on Police) కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన హోంగార్డును తోటి సిబ్బంది ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●JNV Admission | నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలు.. నెలాఖరు వరకు దరఖాస్తులు
- ●POCSO Case | పోక్సో కేసు పెట్టారని.. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురి దారుణ హత్య
- ●Yadagirigutta | యాదాద్రీశుని భక్తులకు అలర్ట్.. ఆ సమయంలో ఆలయానికి వెళ్లారో ఇక అంతే!
- ●Horoscope | జూలై 11 రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

JNV Admission | నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలు.. నెలాఖరు వరకు దరఖాస్తులు

POCSO Case | పోక్సో కేసు పెట్టారని.. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురి దారుణ హత్య

Yadagirigutta | యాదాద్రీశుని భక్తులకు అలర్ట్.. ఆ సమయంలో ఆలయానికి వెళ్లారో ఇక అంతే!

Horoscope | జూలై 11 రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!






