JNV Admission | నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలు.. నెలాఖరు వరకు దరఖాస్తులు
JNV Admission | ప్రస్తుతం విద్య చాలా ఖరీదయిన వ్యహరంలా మారింది. సాధారణ పాఠశాలల్లోనూ చదువుకొనేందుకు వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి వారికి శుభవార్త.
JNV Admission | త్రినేత్ర.న్యూస్: ప్రస్తుతం విద్య చాలా ఖరీదయిన వ్యహరంలా మారింది. సాధారణ పాఠశాలల్లోనూ చదువుకొనేందుకు వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి వారికి శుభవార్త. వచ్చే విద్యా సంవత్సరానికి (2027-28)గాను జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయిది. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు (JNV Admission) చేసుకోవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్నవారు అర్హులు. ప్రవేశ పరీక్షలో (JNVST) వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. నవంబర్‌లో 28న ఈ పరీక్ష ఉంటుంది. 2027 మార్చి చివరి వారంలో పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సీటు వచ్చిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా విద్య అందిస్తారు. అలాగే, బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ సౌకర్యం ఉంటుంది. విద్య, భోజన వసతి, సదుపాయాలతోపాటు సీబీఎస్ఈ సిలబస్, స్కౌట్స్, గైడ్స్, యూనిఫామ్, పుస్తకాలు అందిస్తారు. రాష్ట్రంలో 15 జేఎన్‌వీలు ఉన్నాయి.
అర్హతలు
దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా జవహర్ నవోదయ పాఠశాల ఉన్న సంబంధిత జిల్లా నివాసి అయి ఉండాలి. 2026-27 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్నవారై ఉండాలి. 2015 మే 1 నుంచి 2017 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష ద్వారా
ఈ పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ అండ్ ఎన్నిరాన్మెంటల్ స్టడీస్, అరిథ్‌మెటిక్, లాంగ్వేజ్ టెస్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 2 గంటల్లో పూర్తిచేయాలి. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, కన్నడ మీడియంలో పరీక్ష రాయవచ్చు.
సీట్ల కేటాయింపు ఇలా..
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు. పట్టణప్రాంత విద్యార్థులకు 25 శాతం, దివ్యాంగులకు 3, ఎస్సీ 15, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్ ఉంటుంది. మొత్తం సీట్లలో కనీసం మూడో వంతు బాలికలకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31
ప్రవేశ పరీక్ష: నవంబర్ 28
ఫలితాలు: 2027, మార్చి/ఏప్రిల్
వెబ్సైట్ : https://navodaya.gov.in/
దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
తాజావార్తలు
- ●POCSO Case | పోక్సో కేసు పెట్టారని.. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురి దారుణ హత్య
- ●Yadagirigutta | యాదాద్రీశుని భక్తులకు అలర్ట్.. ఆ సమయంలో ఆలయానికి వెళ్లారో ఇక అంతే!
- ●Horoscope | జూలై 11 రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

POCSO Case | పోక్సో కేసు పెట్టారని.. భార్య, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురి దారుణ హత్య

Yadagirigutta | యాదాద్రీశుని భక్తులకు అలర్ట్.. ఆ సమయంలో ఆలయానికి వెళ్లారో ఇక అంతే!

Horoscope | జూలై 11 రాశి ఫలాలు.. ఈ రాశివారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..



