Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
Hyderabad | హైదరాబాద్ మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినులు అల్లరి చేస్తున్నారని చెప్పి ఓ టీచర్ ప్యాడ్‌ను విసిరేసింది. దీంతో ఓ విద్యార్థిని చెవి తెగిపోయింది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినులు అల్లరి చేస్తున్నారని చెప్పి ఓ టీచర్ ప్యాడ్‌ను విసిరేసింది. దీంతో ఓ విద్యార్థిని చెవి తెగిపోయింది. ఈ ఘటన గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఆసిఫ్‌నగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి కథనం మేరకు.. సెయింట్ ఆన్స్ పాఠశాలలో రజిని అనే మహిళ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఓ తరగతి గదిలో ఆమె విద్యార్థినుల నోట్స్‌ను కరెక్షన్ చేస్తుండగా, కొంత మంది అమ్మాయిలు అల్లరి చేశారు. అల్లరిని అదుపు చేసేందుకు తన చేతిలో ఉన్న ఎగ్జామ్ ప్యాడ్‌ను విద్యార్థినులపైకి విసిరేసింది. దీంతో ఓ అమ్మాయి చెవికి బలమైన గాయం తగిలింది. కొంత మేర చెవి తెగిపోయిందని సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు.
అయితే బాధిత విద్యార్థిని వైద్య ఖర్చులు తామే భరిస్తామని, ఈ ఘటనను ఇక్కడితో ఆపేయండి స్కూల్ యాజమాన్యం తనకు చెప్పిందని ఆమె తండ్రి తెలిపాడు. తమకు వైద్య ఖర్చులు అవసరం లేదని, రజిని అనే టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నాడు. ఈ పాఠశాలలో విద్య బాగుందని తెలుసుకున్న తర్వాతనే చేర్పించానని, టీచర్లు ఇలా ప్రవర్తిస్తారని ఊహించలేదని బాధితురాలి తండ్రి వాపోయాడు.
సంబంధిత వార్తలు

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
ఆగస్టు 13, 2026

Revanth Reddy | మిల్లర్ల బకాయిలు వసూలు చేయండి.. చెల్లించకపోతే మిల్లుల బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగిద్దాం
ఆగస్టు 12, 2026

Sridhar Babu | 5 ఎకరాల భూమిని 7.5 కోట్లకు ఇచ్చాం.. 200 కోట్లు ఎక్కడివో కేటీఆరే చెప్పాలి
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ

Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు



