త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Physiotherapists Jobs | జ‌ర్మ‌నీలో ఫిజియోథెర‌పిస్ట్ ఉద్యోగాలు.. వివ‌రాలివే..

Physiotherapists Jobs | మీరు ఫిజియోథెర‌పిస్ట్ కోర్సు పూర్తి చేశారా..? విదేశాల్లో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అది కూడా జ‌ర్మ‌నీలో ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీలాంటి వారికి ఇది సువ‌ర్ణావ‌కాశం. తెలంగాణ ఓవ‌ర్సీస్ మ్యాన్‌ప‌వ‌ర్ కంపెనీ లిమిటెడ్‌ (TOMCOM) జ‌ర్మ‌నీలో ఉద్యోగ అవ‌కాశం క‌ల్పించేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

S

Telangana | Published On Oct 1, 2026, 6.18 pm IST

Physiotherapists Jobs | జ‌ర్మ‌నీలో ఫిజియోథెర‌పిస్ట్ ఉద్యోగాలు.. వివ‌రాలివే..
Advertisement

Physiotherapists Jobs | త్రినేత్ర న్యూస్ : మీరు ఫిజియోథెర‌పిస్ట్ కోర్సు పూర్తి చేశారా..? విదేశాల్లో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అది కూడా జ‌ర్మ‌నీలో ప్లాన్ చేస్తున్నారా..? అయితే మీలాంటి వారికి ఇది సువ‌ర్ణావ‌కాశం. తెలంగాణ ఓవ‌ర్సీస్ మ్యాన్‌ప‌వ‌ర్ కంపెనీ లిమిటెడ్‌ (TOMCOM) జ‌ర్మ‌నీలో ఉద్యోగ అవ‌కాశం క‌ల్పించేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

ఉద్యోగం : ఫిజియోథెర‌పిస్ట్

అర్హ‌త : బీపీటీ లేదా ఎంపీటీ

అనుభ‌వం : క్లినిక‌ల్ అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌బ‌డుతుంది. ఫ్రెష‌ర్స్ కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు : 43 ఏళ్ల కంటే త‌క్కువ‌గా ఉండాలి.

భాష : జ‌ర్మ‌న్ భాష‌లో బీ1 స్థాయి అవ‌స‌రం.

అభ్యర్థులకు ప్రయోజనాలు

సెలవులు: సాధారణంగా సంవత్సరానికి 25-30 రోజుల సెలవులు.
జీతం : €2,500-€2,900
జర్మన్ లైసెన్స్ పొందిన తర్వాత జీతం: €2,800–€3,500
యజమాని ద్వారా పూర్తి ఆరోగ్య బీమా సదుపాయం
శాశ్వత నివాసానికి అవకాశం

TOMCOM ద్వారా ఉచిత సేవలు

TOMCOMలో మేము పూర్తిగా ఉచితంగా జర్మన్ భాషా శిక్షణ, డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ప్రాసెసింగ్ సపోర్ట్, వీసా అసిస్టెన్స్, జర్మనీకి విమాన టికెట్ అందిస్తున్నాం. జర్మనీలో ఉద్యోగం చేయాలనే మీ కలను సాకారం చేసుకునేందుకు ప్రతి దశలో పూర్తి సహాయాన్ని అందిస్తాం. త‌దిత‌ర వివ‌రాల కోసం 08035524946 నంబ‌ర్‌ను సంప్ర‌దించొచ్చు.

Advertisement
Advertisement