త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Yennam Srinivas Reddy, Anirudh Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు విచార‌ణ‌కు ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్‌

MLA Yennam Srinivas Reddy, Anirudh Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. నేడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట వాంగ్మూలం ఇవ్వనున్నారు.

S

Telangana | Published On Jun 1, 2026, 11.44 am IST

MLA Yennam Srinivas Reddy, Anirudh Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు విచార‌ణ‌కు ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ఫిర్యాదులతో ఈ కేసు కీలక దశకు చేరుకుంది. ఇందులో భాగంగా నేడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు అధికారుల ఎదుట వాంగ్మూలం ఇవ్వనున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం జారీ చేసిన రెండో నోటీసు మేరకు వీరు సోమ‌వారం హాజరుకానున్నారు.

బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐసీసీసీ కార్యాలయంలో 18వ అంతస్తులో వీరిని విచారించ‌నున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ యెన్నం శ్రీనివాస్ రెడ్డి తొలి ఫిర్యాదుదారుగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు విచారణకు సంబంధించిన కీలక విషయాలపై ఆయ‌న‌ వాంగ్మూలం ఇవ్వ‌నున్నారు.

Advertisement
Advertisement