Kavitha | జయశంకర్ సార్ విగ్రహం పెట్టడం చారిత్రక అవసరం.. అనుమతివ్వండి: కవిత విజ్ఞప్తి
Kavitha | తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ దివంగత కొత్తపల్లి జయశంకర్ విగ్రహం హైదరాబాదులో అధికారికంగా కొలువు తీరడం ఒక చారిత్రక అవసరమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ జాగృతి సంస్థకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ దివంగత కొత్తపల్లి జయశంకర్ విగ్రహం హైదరాబాదులో అధికారికంగా కొలువు తీరడం ఒక చారిత్రక అవసరమని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ జాగృతి సంస్థకు అనుమతినివ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆమె సీఎంను ఎక్స్ వేదికగా కోరారు.

సార్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న జాగృతి ఇప్పటికే నాలుగు జిల్లా కేంద్రాల్లో వారి విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకుంది. 2017లోనూ గత ప్రభుత్వాన్ని ఇదే విషయమై విన్నవించినా సరైన స్పందన రాలేదు. మహనీయులను గౌరవించుకోవడం అంటే మన చరిత్రను మనం గౌరవించుకోవడమే అని కవిత పేర్కొన్నారు.

తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రత్యేక రాష్ట్రమే ఏకైక పరిష్కారమని నమ్మి తుదికంటా తండ్లాడిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. తెలంగాణ వచ్చిన తర్వాత అంతటి మహనీయుని కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ 12 ఏళ్లలో అధికారికంగా ఏర్పాటు చేసుకోలేకపోవడం దురదృష్టకరం. జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుతో విగ్రహ ప్రాంగణం గ్రీనరీ నిర్వహణ కూడా తమ సంస్థ పక్షాన చూసుకుంటాం. సార్ జయంతి అయిన ఆగస్ట్ 6 నాటికి విగ్రహ ఏర్పాట్లు పూర్తి అయ్యేలా తగు చర్యలు తీసుకోండి అని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kavitha | మా అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోం.. మూతి పళ్లు రాలుతయ్: కవిత హెచ్చరిక
జూన్ 1, 2026

Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్
జూన్ 1, 2026

Mahalakshmi Smart Card | ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొందడం ఎలా..?
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?
- ●CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు
- ●Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్
- ●Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
- ●Cabinet Expands | బెంగాల్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం
- ●Mahalakshmi Smart Card | ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మీ స్టార్ట్ కార్డులు పొందడం ఎలా..?

AePS | ఆధార్ నంబర్‌తో నగదు విత్‌డ్రా.. AePS అంటే ఏమిటి?

CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు

Mahesh Kumar Goud | రాహుల్ గాంధీకి స్వార్థం ఉంటే 2004లోనే ప్రధాని కావాలి కదా..? : మహేశ్ కుమార్ గౌడ్

Rajya Sabha Elections | మోగిన ఎన్నికల నగారా.. 24 రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ



