త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ESIC Dispensaries | సిబ్బంది కొరత, ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం.. రాష్ట్రంలో 15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు రద్దు

ESIC Dispensaries | కార్మికులు, చిరుద్యోగుల‌కు ఉచితంగా మెరుగైన వైద్యం, మందులు అందించేందుకు మంజూరు చేసిన కొత్త డిస్పెన్స‌రీలు (ESIC Dispensaries) తెరుచుకోకుండానే మూత‌ప‌డే అవ‌కాశం ఉన్న‌ది. అధికారుల నిర్ల‌క్ష్యంతో ఏండ్ల‌ తరబడి కాగితాలకే పరిమితమైన 88 డిస్పెన్సరీల తాత్కాలిక ఆమోదాన్ని ఎంప్లాయీస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ (ESI) రద్దు చేసింది.

G

Telangana | Published On Feb 23, 2026, 6.14 am IST

ESIC Dispensaries | సిబ్బంది కొరత, ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం..  రాష్ట్రంలో 15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు రద్దు
Advertisement

ESIC Dispensaries | త్రినేత్ర‌.న్యూస్‌: కార్మికులు, చిరుద్యోగుల‌కు ఉచితంగా మెరుగైన వైద్యం, మందులు అందించేందుకు మంజూరు చేసిన కొత్త డిస్పెన్స‌రీలు (ESIC Dispensaries) తెరుచుకోకుండానే మూత‌ప‌డే అవ‌కాశం ఉన్న‌ది. అధికారుల నిర్ల‌క్ష్యంతో ఏండ్ల‌ తరబడి కాగితాలకే పరిమితమైన 88 డిస్పెన్సరీల తాత్కాలిక ఆమోదాన్ని ఎంప్లాయీస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ (ESI) రద్దు చేసింది. దీంతో రాష్ట్రంలోని 15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ర‌ద్ద‌య్యాయి.

2018, ఫిబ్రవరిలో 6, ఏప్రిల్‌ నెల్లో మరో 5, ఆగస్టులో మరో 4 కలిపి మొత్తం 15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు కేంద్రం అనుమ‌తిచ్చింది. అయితే స్థ‌ల‌సేక‌ర‌ణ‌, భవనాల నిర్మాణంలో జాప్యం, సిబ్బంది నియామకాల్లో నిర్లక్ష్యం వంటి కార‌ణాల‌తో అవి కాగితాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ఈ విష‌య‌మై రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ ఎలాంటి మార్పు లేకుండా పోయింది. వీని ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చేందుకు కార్యాచరణ మొదలుపెట్టాలని ఇటీవ‌ల‌ 15 రోజులు గ‌డువు ఇచ్చింది. లేన‌ట్ల‌యితే వాటి అనుమతులు రద్దు చేస్తామని స్ప‌ష్టం చేసింది. గడువు ముగిసినప్ప‌టికీ ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డంతో కేంద్రం అన్నంత‌ప‌నీ చేసింది. దీంతో రాష్ట్రంలో కొత్త‌గా ఏర్పాటు చేయాల్సిన 15 డిస్పెన్స‌రీల అనుమ‌తులు డాక్టర్ల కొరత, సిబ్బంది లేకపోవడంతో వెన‌క్కి వెళ్లాయి.

కాగా, ప్రతి డిస్పెన్సరీలో కనీసం ఒకరు, ఇద్దరు డాక్టర్లు ఉండాలి. కానీ ప్ర‌భుత్వం నియామకాలు చేపట్టలేదు. నిధుల కొర‌త కూడా దీనికితోడైంది. త‌న వాటాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన‌ నిధులు సకాలంలో జమ చేయలేదు. దీంతో దౌల్తాబాద్ (మెదక్), సిద్దిపేట, తాండూరు, ఘట్‌కేసర్‌, కరీంనగర్‌, గీసుగొండ, కేటీటీపీ చెల్పూర్ (వరంగల్‌), జైపూర్ (మంచిర్యాల), ముదిగొండ (ఖమ్మం), ఆదిలాబాద్‌, ధర్మాసాగర్ (హనుమ‌కొండ), సూర్యాపేట, కోదాడ, మహేశ్వరం, ధర్మాసాగర్‌ మండలం (హన్మకొండ)లో ఏర్పాటు చేయాల్సిన ఈఎస్ఐలు ఉనికిలోకి రాకుండానే ర‌ద్ద‌య్యాయి.

Advertisement
Advertisement