త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | రిటైర్డ్ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బ‌కాయిలు విడుద‌ల‌

Telangana | తెలంగాణ ప్ర‌భుత్వ రిటైర్డ్ ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బ‌కాయిల కోసం రూ. 1000 కోట్లు విడుద‌ల చేసింది కాంగ్రెస్ స‌ర్కార్.

S

Telangana | Published On Apr 29, 2026, 5.16 pm IST

Telangana | రిటైర్డ్ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బ‌కాయిలు విడుద‌ల‌
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ప్ర‌భుత్వ రిటైర్డ్ ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బ‌కాయిల కోసం రూ. 1000 కోట్లు విడుద‌ల చేసింది కాంగ్రెస్ స‌ర్కార్. నెల‌వారీ చెల్లింపుల‌ను రూ. 700 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల‌కు పెంచారు. గ‌తేడాది అక్టోబ‌ర్ నెల వ‌ర‌కు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బ‌కాయిల‌ను ప్ర‌భుత్వం క్లియ‌ర్ చేసింది. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిల చెల్లింపులో జాప్యంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ నిధులతో అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలన్నింటినీ పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఉద్యోగుల మెడికల్ బిల్లులను ఎలాంటి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడమైనది. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, వారి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నామ‌ని ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement