త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagga Reddy | రెడ్ల స‌పోర్ట్‌తోనే మ‌హేశ్ గౌడ్ పీసీసీ చీఫ్‌ అయ్యారు.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Jagga Reddy | కాంగ్రెస్ పార్టీలోని రెడ్ల స‌పోర్ట్‌తోనే మ‌హేశ్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యార‌ని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దాదాపు 104 రోజుల త‌ర్వాత గాంధీ భ‌వ‌న్‌కు వ‌చ్చిన జ‌గ్గారెడ్డి మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

S

Telangana | Published On Apr 14, 2026, 5.37 pm IST

Jagga Reddy | రెడ్ల స‌పోర్ట్‌తోనే మ‌హేశ్ గౌడ్ పీసీసీ చీఫ్‌ అయ్యారు.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

Jagga Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కాంగ్రెస్ పార్టీలోని రెడ్ల స‌పోర్ట్‌తోనే మ‌హేశ్ గౌడ్ పీసీసీ చీఫ్ అయ్యార‌ని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దాదాపు 104 రోజుల త‌ర్వాత గాంధీ భ‌వ‌న్‌కు వ‌చ్చిన జ‌గ్గారెడ్డి మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లోలో పీసీసీ చీఫ్ జగ్గారెడ్డి అని అన్నారు. అది చర్చ కాదు. మూడేళ్లకో.. నాలుగేళ్ల‌కో అన్నట్టు వెంకన్న అన్నాడు. మహేష్ గౌడ్ కంటిన్యూ కూడా కావచ్చు. దీని మీద ఒకరిద్దరు బీసీ బ్రదర్స్ మాట్లాడారు. ఊర్లో రెడ్డి.. బీసీలు కలిసి ఉంటాం.. కలిసి పని చేస్తాం. ఇక పీసీసీ చీఫ్‌గా మ‌హేశ్ గౌడ్ పేరును ప్ర‌తిపాదించింది నేనే. రెడ్లు అంతా సపోర్ట్ చేస్తేనే మహేష్ గౌడ్ పీసీసీ అయ్యారు. మేమంతా ఫ్రెండ్లీగా ఉన్నాం. ఎవ‌రూ కూడా మా ఫ్రెండ్‌షిప్‌ను క‌రాబ్ చేయకండి అని జ‌గ్గారెడ్డి సూచించారు.

రాజ‌గోపాల్ రెడ్డిని కూడా కేబినెట్‌లోకి తీసుకోవాలి..

కేబినెట్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ ఉంటే తప్పు ఏంది? సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇదే చెప్తా. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని కేబినెట్‌లో కొన‌సాగించాలి. రాజ‌గోపాల్ రెడ్డిని కూడా కేబినెట్‌లోకి తీసుకోవాలి. ఇక డబ్బులు లేకుండా రాజకీయం లేదు. ఎవరు డబ్బు పెడితే వాళ్ళు నాయకుడు అవుతున్నారు. ఎమ్మెల్యేగా గెల‌వాలంటే రూ. 100 కోట్లు ఖ‌ర్చు అవుతున్నాయని జ‌గ్గారెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement