Gudem Mahipal Reddy | మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Gudem Mahipal Reddy | మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కోరారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు.
Gudem Mahipal Reddy | తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, అధికార పార్టీలో, ప్రభుత్వం నుంచి పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో కొందరు నేతలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ మళ్లీ సొంత గూటి వైపు వెళ్లేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో ఆయన సోదరుడు భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. దీంతో గూడెం మహిపాల్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఆయన మరోసారి వార్తలకెక్కారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్‌కు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయన బహిరంగంగా బీఆర్ఎస్‌కు అనుకూలంగా పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో చేరాలని తీసుకున్న నిర్ణయం తప్పేనని ఆయన గతంలో ఓ వేదికపై వ్యాఖ్యానించారు. అయితే, ప్రభుత్వంలో ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వస్తాయన్న ఉద్దేశంతోనే అధికార పార్టీలో చేరినట్లు ఆయన సన్నిహిత పేర్కొంటున్నారు. అయితే, ఆ తర్వాత ప్రభుత్వ నుంచి ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తిరిగి బీఆర్ఎస్‌లో చేరేందుకు యోచిస్తున్నారని సమాచారం.
గతంలోనే గులాబీ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పట్లో బీఆర్ఎస్ అధిష్టానం సానుకూలంగా స్పందించలేదన్న ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఆయన సోదరుడు కేసీఆర్‌తో సమావేశమవడం, అలాగే బీఆర్ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడం నేపథ్యంలో ఈసారి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఆయన అధికారికంగా బీఆర్ఎస్‌లో చేరే అవకాశముందని సమాచారం.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



