Ponnam Prabhakar | కార్యకర్తలారా.. మీ గ్రామాల్లో పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించండి
Ponnam Prabhakar | పార్టీ కార్యకర్తలు, నాయకులు వారి వారి గ్రామాల్లో ఎక్కడ పట్టభద్రులు ఉన్నా వారి ఓటు హక్కు నమోదయ్యేలా చూసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
- పట్టభద్రుల హక్కుల కోసం పోరాడే గొంతు శాసనమండలిలో ఉండాలి
- నార్సింగి పట్టభద్రుల సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: పార్టీ కార్యకర్తలు, నాయకులు వారి వారి గ్రామాల్లో ఎక్కడ పట్టభద్రులు ఉన్నా వారి ఓటు హక్కు నమోదయ్యేలా చూసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచేలా పట్టభద్రులు ఓటు నమోదు చేయించేలా చూసుకోవాలన్నారు. ఆదివారం నార్సింగిలో టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల సమ్మేళనం- 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించాం. మూడు జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు చేయాలి. పార్టీ కార్యకర్తలు ఆక్టివ్‌గా ఉండాలి. హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా నేను, రంగారెడ్డి ఇంచార్జి మంత్రిగా శ్రీధర్ బాబు, మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మంత్రిగా దామోదర రాజనరసింహ ఆయా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, ఎంపీలు, పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతుంది.
ఈ మధ్య సర్‌లో భాగంగా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. 2001లో జరిగినపుడు అర్హత ఉన్న ఒక ఓటు కూడా మిస్ కాకుండా చూసారు. ఇప్పుడు ఒక పార్టీకి లాభం జరిగేలా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మీద అవిశ్వాసం పెట్టే స్థాయికి వెళ్ళింది. ఓట్లు తొలగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీగా రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్న పార్టీగా పోరాడుతుంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పట్టభద్రులు తమ ఓటు నమోదు చేసుకోవాలి. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ పట్టభద్రులు ఉన్నా వారి ఓటు హక్కు నమోదు అయ్యేలా చూసుకోవాలి.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అని కుమార్ యాదవ్, చేవెళ్ల కాంగ్రెస్ ఇంచార్జి భీమ్ భరత్, నైనా జైస్వాల్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | మహిళల ఆర్థిక సాధికారతే.. సమాజ అభివృద్ధికి పునాది: మంత్రి పొన్నం ప్రభాకర్
సెప్టెంబర్ 28, 2026

Allu Sirish | పండుగ ముగిసినా.. మైకుల మోత ఆగలేదు.. పోలీసులకు అల్లు శిరీశ్ ఫిర్యాదు
సెప్టెంబర్ 28, 2026

Fake Notes | మార్కెట్లోకి 500 రూపాయల నకిలీ నోట్లొచ్చేశాయ్.. బీ కేర్ ఫుల్
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | మహిళల ఆర్థిక సాధికారతే.. సమాజ అభివృద్ధికి పునాది: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు
- ●Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..
- ●Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..
- ●PB Fintech | పాలసీ బజార్ షేర్లకు ఊరట.. 4 శాతం జంప్.. కొనాలా.. వేచి చూడాలా..?

Ponnam Prabhakar | మహిళల ఆర్థిక సాధికారతే.. సమాజ అభివృద్ధికి పునాది: మంత్రి పొన్నం ప్రభాకర్

Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు

Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..

Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?









