Murder | ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని.. తల్లిదండ్రులను చంపిన కూతురు
Murder | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని ఓ కూతురు తన తల్లిదండ్రులను హత్య చేసింది.
Murder | త్రినేత్ర.న్యూస్ : ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదని ఓ కూతురు తన తల్లిదండ్రులను హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. యాచారం గ్రామానికి చెందిన నక్క సురేఖ నర్సింగ్ హోంలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. అయితే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చూడా చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి కులాలు వేరు కావడంతో.. పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు.
తన ప్రేమ పెళ్లికి అడ్డు పడుతున్న తల్లిదండ్రులను తొలగించుకోవాలని ఆ యువతి కుట్ర పన్నింది. కుట్రలో భాగంగా.. తాను పనిచేస్తున్న నర్సింగ్ హోం నుండి అనస్థీషియా తెచ్చి, ఒళ్లు నొప్పులకు మందు అని చెప్పి, ఎక్కువ డోసేజ్ కలిగిన ఇంజెక్షన్లు తల్లిదండ్రులకు యువతి ఇచ్చింది. దాంతో తల్లిదండ్రులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత తల్లిదండ్రులు చనిపోయారని చెప్పి సోదరుడికి సమాచారం అందించింది.
యువతి ప్రవర్తనపై కుటుంబ సభ్యులకు, బంధువులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా, తానే హత్య చేసినట్లు అంగీకరించింది యువతి. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్వర్క్పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Honesty of an auto driver | ఆపరేషన్ డబ్బులు ఆటోలోనే మరిచాడు.. గంటల్లోనే బాధితుడికిచ్చేశారు
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



