Chinna Reddy group followers | గాంధీ భవన్‌ను ముట్టడించిన చిన్నారెడ్డి వర్గం.. తీవ్ర ఉద్రిక్తత
Chinna Reddy group followers | వనపర్తి కాంగ్రెస్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య వర్గ పోరు తీవ్రమైంది. చిన్నారెడ్డికి పార్టీ హైకమాండ్ నోటీసులు ఇవ్వడంపై ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Chinna Reddy group followers | త్రినేత్ర.న్యూస్: వనపర్తి కాంగ్రెస్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య వర్గ పోరు తీవ్రమైంది. చిన్నారెడ్డికి పార్టీ హైకమాండ్ నోటీసులు ఇవ్వడంపై ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయన వర్గీయులు శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ను ముట్టడించారు. భవన్ ఎదుటే బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
చిన్నారెడ్డి పార్టీ లైన్ దాటలే..
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారెడ్డి ఎప్పటినుంచో పార్టీలో ఉన్నారన్నారు. ఆయన ఏనాడూ పార్టీ లైన్‌ను దాటలేదని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన నేతపై క్రమశిక్షణ చర్యలు ఏంటని ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ నాయకులతో కలిసి వెళ్లి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన గొప్ప నాయకుడు చిన్నారెడ్డి అని కొనియాడారు.
1980 నుంచి 1983 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని గుర్తు చేశారు. 1985లో వనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 1989లో ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలుపొందారన్నారు. వైఎస్ మంత్రివర్గంలో 2007లో గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారన్నారు.
కుమ్ములాటలతో కకావికలమైన కాంగ్రెస్.
గాంధీ భవన్‌ను ముట్టడించిన మాజీ మంత్రి చిన్నారెడ్డి వర్గం.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగిన చిన్నారెడ్డి వర్గం. pic.twitter.com/pe0nxQHqXq
— Mission Telangana (@MissionTG) August 21, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Balmuri Venkat | బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై సీఎం పర్యటను అడ్డుకున్నయ్ : బల్మూరి వెంకట్
ఆగస్టు 21, 2026

MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి… ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు
ఆగస్టు 21, 2026

Bharathi Mukhi Accident Case | యువతి భారతి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్లక్ష్య డ్రైవింగే కారణమని నిర్ధారణ
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●Education | అమెరికాలో తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్న టాప్ 5 యూనివర్సిటీలు ఇవే..
- ●Balmuri Venkat | బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై సీఎం పర్యటను అడ్డుకున్నయ్ : బల్మూరి వెంకట్
- ●MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి... ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు
- ●Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
- ●Bharathi Mukhi Accident Case | యువతి భారతి ముఖి మృతి కేసులో నిందితుడి గుర్తింపు.. నిర్లక్ష్య డ్రైవింగే కారణమని నిర్ధారణ
- ●Sowcar Janaki | దిగ్గజ నటి షావుకారు జానకి కన్నుమూత - రెండు వందల తెలుగు సినిమాల్లో హీరోయిన్గా!

Education | అమెరికాలో తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్న టాప్ 5 యూనివర్సిటీలు ఇవే..

Balmuri Venkat | బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై సీఎం పర్యటను అడ్డుకున్నయ్ : బల్మూరి వెంకట్

MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి... ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు

Beerla Ilaiah | సుష్మిత వ్యాఖ్యలను కొండ సురేఖ ఖండించాలే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య



