Revanth Reddy | తరుణ్ గొగోయ్.. కేజ్రీవాల్.. అర్జున్ ముండా.. రేవంత్ రెడ్డి
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమెరికా పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో..కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది.
అందుకే యూఎస్ టూర్ కు పర్మిషన్ ఇవ్వలేదు: కేంద్ర విదేశాంగ శాఖ
వివరాలు సరిగ్గా పొందుపరచలేదు..
అందుకే అనుమతి నిరాకరించాం
త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమెరికా పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో..కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. “ముఖ్యమంత్రి పర్యటనలు, అలాగే ఇతర ప్రముఖుల పర్యటనలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. రాజకీయ అనుమతి (Political Clearance) పొందేందుకు, ప్రతిపాదిత పర్యటన ఏ కార్యాలయం/హోదాకు సంబంధించినదో, అలాగే పర్యటన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా ఉండాలి. ఈ ప్రత్యేక సందర్భంలో, అమెరికా పర్యటనకు సంబంధించి ఆ వివరాలు తగిన విధంగా లేవు. అందువల్ల అమెరికాలో పర్యటించేందుకు రేవంత్ రెడ్డికి అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో.. యునైటెడ్ కింగ్‌డమ్ (UK) పర్యటనకు మాత్రం అనుమతి ఉంది” అని చెప్పారు. దీంతో.. ముఖ్యమంత్రి పర్యటనపై వస్తున్న అనేక పుకార్లకు తెరపడింది.
నాడు తరుణ్ గొగోయ్..అర్జున్ మొండా..కేజ్రీవాల్ లకు కూడా
2012 లో యూపీఏ హయాంలో అసోం సీఎం గా ఉన్న తరుణ్ గొగోయ్ (నాటి కాంగ్రెస్ సీఎం) కూడా అమెరికా, ఇజ్రాయెల్ పర్యటనకు అనుమతి కోరారు. కానీ యూపీఏ ప్రభుత్వం ఆయనకు అనుమతి నిరాకరించింది. ఝార్ఖండ్ సీఎంగా ఉన్న అర్జున్ మొండా (బీజేపీ) కు కూడా ధాయ్ లాంట్ అనుమతి ఇవ్వలేదు. 2019లో ఢిల్లీ సీఎంగా ఉన్న అర్వింద్ కేజ్రీవాల్ కు కూడా .. ఎన్డీఏ ప్రభుత్వం అమెరికా పర్యటనకు అనుమతించలేదు.
సంబంధిత వార్తలు

Ramchandar Rao | అమెరికా టూర్‌కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచందర్‌రావు ఏమన్నారంటే..
ఆగస్టు 21, 2026

Balu Naik | క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే : కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్
ఆగస్టు 21, 2026

Balmuri Venkat | బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై సీఎం పర్యటను అడ్డుకున్నయ్ : బల్మూరి వెంకట్
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●Ramchandar Rao | అమెరికా టూర్‌కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచందర్‌రావు ఏమన్నారంటే..
- ●Trisha | పొలిటికల్ లీడర్‌గా త్రిష - రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో...
- ●Balu Naik | క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే : కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్
- ●Chinna Reddy group followers | గాంధీ భవన్‌ను ముట్టడించిన చిన్నారెడ్డి వర్గం.. తీవ్ర ఉద్రిక్తత
- ●Stock Markets | వణుకు పుట్టిస్తున్న ముడి చమురు ధరలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●Education | అమెరికాలో తక్కువ ఖర్చుతో కోర్సులను అందిస్తున్న టాప్ 5 యూనివర్సిటీలు ఇవే..

Ramchandar Rao | అమెరికా టూర్‌కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచందర్‌రావు ఏమన్నారంటే..

Trisha | పొలిటికల్ లీడర్‌గా త్రిష - రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్‌లో...

Balu Naik | క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే : కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్

Chinna Reddy group followers | గాంధీ భవన్‌ను ముట్టడించిన చిన్నారెడ్డి వర్గం.. తీవ్ర ఉద్రిక్తత



