త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balu Naik | క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే : కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయ‌క్‌

Balu Naik | పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ అధిష్టానాన్ని కోరారు. కొండ సుష్మిత చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా స‌మావేశంలో ముక్త‌కంఠంతో ఖండించారు.

P

Telangana | Published On Aug 21, 2026, 4.25 pm IST

Balu Naik | క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే : కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయ‌క్‌
Advertisement

Balu Naik | పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయ‌క్ అధిష్టానాన్ని కోరారు. కొండ సుష్మిత చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా స‌మావేశంలో ముక్త‌కంఠంతో ఖండించారు. ఈ సంద‌ర్భంగా బాలు నాయ‌క్ మాట్లాడుతూ.. 'గ‌త కొన్నిరోజులుగా పార్టీలో జ‌రుగుతున్న‌టువంటి అంత‌ర్గ‌త విష‌యాలు, పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అంద‌రం ఏక‌వ‌చ‌నంతో కోరుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప‌ది సంవ‌త్స‌రాలు అనేక మంది కార్య‌క‌ర్త‌లు క‌ష్టార్జితం, ర‌క్తాన్ని ధార‌బోసి రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చారు. పోలీసు కేసులు, వాళ్ల ఆస్తుల‌ను, ప్రాణాల‌ను పోగొట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు రేవంత్‌రెడ్డి ప‌డ్డ క‌ష్టం అంద‌రికీ తెలుసు' అన్నారు.

ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్న‌రు

'రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోనే కాంగ్రెస్ పార్టీ సోనియా, రాహుల్ గాంధీ ఆశీస్సుల‌తోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చింది. ప్ర‌భుత్వాన్ని, చేప‌డుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై కేబినెట్‌లోనే ఉన్న మంత్రి, కుటుంబ స‌భ్యులు మాట్లాడిన తీరును గ్రామీణ స్థాయి కార్య‌క‌ర్త‌లు అస‌హ్యించుకుంటున్న క్ర‌మంలో మేం అంద‌రం ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన్ని మేం ఒక‌టే కోరుతున్నాం. మ‌నం అంద‌రం పార్టీ బ‌తుకుతేనే.. అంద‌రం బ‌తుకుతం. పార్టీకి న‌ష్టం జ‌రిగితే.. ముఖ్య‌మంత్రిని బ‌ల‌హీన‌ప‌రచాల‌నే ప్ర‌తిప‌క్షాల కుట్ర‌ను వీళ్లు అమ‌లు చేస్తున్న‌రు. వీళ్లు అమ‌లుచేసే కుట్ర చాలామందికి అర్థం అవుతోంది. తెలంగాణ ప్ర‌జ‌లు కూడా అర్థం చేసుకుంటున్న‌రు. మీరు ఆయుధాలు వారి చేతికి ఇవ్వ‌డం అంటేనే.. మీరు మాట్లాడే విధానం, ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే విధానం, సీఎం రేవంత్‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌నే కుట్ర‌ను, ప్ర‌తిప‌క్షాల ఆలోచ‌ల్ని మీరు అమ‌లు చేస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు కూడా అర్థం చేసుకుంటున్న‌రు' అని బాలు నాయ‌క్ పేర్కొన్నారు.

నోటీసుల‌తో వ‌దిలేయొద్దు..

'రాష్ట్రంలోని ప్ర‌తి కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త అర్థం చేసుకుంటున్న‌డు. ఎవ‌రు మాట్లాడినా.. చిన్నారెడ్డి.. రాజ‌గోపాల్‌రెడ్డి.. బాలు నాయ‌క్ మాట్లాడినా క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించినా.. ప్ర‌భుత్వాన్ని బ‌ల‌హీన ప‌రిచే కార్య‌క్ర‌మాలు ఎవ‌రు చేసినా.. ముఖ్య‌మంత్రిని, ప్ర‌భుత్వాన్ని బ‌ల‌హీన‌ప‌రిచే ఎవ‌రు చేసినా వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధిష్టానాన్ని కోరుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటుప‌డుతోంది. ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్న‌రు సీఎం రేవంత్‌రెడ్డి ప‌ట్ల‌. వీళ్లు అంద‌రూ ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డం ఖాయం. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంది. ఆయ‌న నాయ‌క‌త్వంలోనే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది. మీరు ఎన్ని కుట్ర‌లు ఇందులో ఉండి చేసినా.. వారి ఆలోచ‌న‌ల‌ను అమ‌లు చేసినా తెలంగాణ ప్ర‌జ‌లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రుచుకుంటూ ముందుకెళ్తున్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు లోబ‌డి మొన్న పీసీసీ అధ్య‌క్షుడు, ఏసీసీఐ ఇన్‌చార్జి మీనాక్షి, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోండి. షోకాజ్ నోటీసుల‌తో వ‌దిలిపెట్ట‌కండి' అంటూ బాలు నాయ‌క్ అధిష్టానాన్ని కోరారు.

చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌దే మా డిమాండ్‌

'వీరంతా కాంగ్రెస్‌ను, ప్ర‌భుత్వాన్ని బ‌ల‌హీన‌ప‌రుస్తున్న‌రు. మా అంద‌రి భ‌విష్య‌త్‌ను బ‌ల‌హీన‌ప‌రుస్తున్న‌రు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను బ‌ల‌హీన ప‌రుస్తున్న కాబ‌ట్టి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి. కులం, హోదాతో సంబంధం లేకుండా.. పార్టీని బ‌ల‌హీన‌ప‌రిచే మాట‌లు మాట్లాడితే చ‌ర్య‌లు తీసుకోవాల‌నేది మా అంద‌రి డిమాండ్‌. అందులో భాగంగానే మేం ఒక‌టే కోరుతున్నాం. ఏదైతే మాట్లాడ‌ద‌ల‌చుకుంటే ముఖ్య‌మంత్రితో మాట్లాడుకోండి స‌మ‌స్య‌లుంటే. లేక‌పోతే అధిష్టానం రాహుల్ గాంధీ, ప్రియాంక‌, సోనియా గాంధీ, అధ్య‌క్షుడు ఖ‌ర్గే ఉన్న‌రు. ఏదైనా వారితో మాట్లాడుకోండి. కానీ, ప్ర‌భుత్వంపై, ముఖ్య‌మంత్రిపై మాట్లాడే విధానం ప్ర‌తిప‌క్షాల‌కు ఆయుధాలుగా మార్చి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బ‌ల‌హీన‌ప‌రిచేలా చేస్తున్న విధానం స‌రికాదు. ప‌త్రిక‌లు, సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా వార్త‌లు రాంగ‌నే పెద్ద‌వాళ్లం అయిపోయామ‌ని అనుకుంటున్న‌రు. గ్రామాల్లో కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్న‌రు మీ స్థాయిని చూసి' అంటూ విమ‌ర్శించారు.

దుర్మార్గ‌మైన సంస్కృతి మంచిది కాదు..

'సొంత పార్టీలో ఉండి.. నీడ‌నిచ్చే చెట్టును న‌రుకున్న దుర్మార్గ‌మైన సంస్కృతిది మంచిది కాదు. ఎవ‌రికి స‌మ‌స్య‌లుంటే అధిష్టానికి చెప్పాలి. పార్టీకి న‌ష్ట‌ప‌రిచే ప‌ని చేయొద్దు. మా అంద‌రి, ప్ర‌జ‌లు, కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలోనే బ‌ల‌ప‌డుతుంది. కొండ సురేఖ నా కూతురు మాట్లాడింది అంటున్న‌రు.. మ‌రి ఎందుకు ఖండించ‌లేదు. కేబినెట్‌లో ఉంట‌రు. ప‌క్క‌కు లేరే. కేబినెట్‌లో జ‌రిగే ప్ర‌తి నిర్ణ‌యాల్లో మీరు కూడా బాధ్యులు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై మాట్లాడిన‌ప్పుడు ఎందుకు స్పందించ‌లేదు. ఇందులో ఎవ‌రు అర్హ‌త లేనోళ్లు. అంద‌రూ అర్హ‌త క‌లిగిన వారు ఉన్నారు. కొంద‌రినే ప్ర‌భుత్వంలోకి తీసుకున్నారు. తీసుకున్న‌టివాళ్లు ప్ర‌భుత్వాన్ని కాపాడాల్సిన బాధ్య‌త మీది. రేవంత్‌రెడ్డి ఒక్క‌డు బ‌ల‌హీన‌ప‌డితే మ‌నం అంద‌రం బ‌ల‌ప‌డం. పార్టీ మొత్తం బ‌ల‌హీన‌ప‌డుతుంది. ఆ బ‌ల‌హీన ప‌డాల‌నే కుట్ర ప్ర‌తిప‌క్షాలు బీజేపీ, బీఆర్ఎస్‌తో సాధ్యం కావ‌డం లేదు. అందుకే సొంత పార్టీ నుంచి చేసున్న కుట్ర‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధిష్టానాన్ని కోరుతున్నాం' అని బాలు నాయ‌క్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement