TET | ఉపాధ్యాయులకు మరోసారి నిరాశే.. టెట్‌లో 27 వేల మంది టీచర్లు ఫెయిల్
TET | ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (TET) టీచర్లకు మరోసారి నిరాశే ఎదురయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Teachers) టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి.
TET | త్రినేత్ర.న్యూస్: ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (TET) టీచర్లకు మరోసారి నిరాశే ఎదురయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు (Teachers) టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ నేపథ్యంలో గత నెలలో నిర్వహించిన ఈ అర్హత పరీక్షకు 65,605 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. వీరిలో 42.24 శాతం మంది అంటే 27,712 మంది టీచర్లు ఫెయిలయ్యారు. మిగిలి 37,803 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంత పెద్దసంఖ్యలో (57.76 శాతం) ఉపాధ్యాయులు అర్హత సాధించడం ఇదే మొదటిసారికావడం గమనార్హం. అర్హత సాధించని టీచర్లకు మరో 3 టెట్లు రాసే ఛాన్స్ ఉంటుంది.
కాగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన టెట్ పరీక్షల్లో ఈ సారి రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదయింది. రెండు పేపర్లకు కలిపి టెట్‌కు 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జనవరి 3 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. వీరిలో సుమారు 1,00,270 మంది (51.37 శాతం) అర్హత సాధించారు. పేపర్-1లో ఏకంగా 72 శాతం మంది పాసయ్యారు. పేపర్-2 గణితం, సైన్స్‌లో 42.37 శాతం, సోషల్‌లో 35.86 శాతం మంది అర్హత సాధించారు.
టెట్‌లో ఒక్కసారి పాసైతే ఆ స్కోర్‌కు జీవితకాలం గుర్తింపు ఉంటుంది. ఈ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. టెట్ ప్రవేశపెట్టకముందు ఉద్యోగాల్లో చేరి, అయిదేళ్లకు మించి సర్వీసు ఉన్న టీచర్లందరూ టెట్ రాయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వారంతా కొలువులో కొనసాగాలంటే రెండేండ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబరులో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






