త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fees Reimbursement | జీవో 7ను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. ఓయూ విద్యార్థి సంఘాలు

Fees Reimbursement | జీవో నంబర్ 7ను ప్ర‌భుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాల‌ని ఓయూ విద్యా సంఘాలు (OU Students) డిమాండ్ చేశాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ (Fees Reimbursement) బ‌కాయిల‌ను విడుదల చేయాల‌న్నారు.

G

Telangana | Published On May 7, 2026, 5.55 pm IST

Fees Reimbursement | జీవో 7ను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. ఓయూ విద్యార్థి సంఘాలు
Advertisement

Fees Reimbursement | త్రినేత్ర‌.న్యూస్‌: జీవో నంబర్ 7ను ప్ర‌భుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాల‌ని ఓయూ విద్యా సంఘాలు (OU Students) డిమాండ్ చేశాయి. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ (Fees Reimbursement) బ‌కాయిల‌ను విడుదల చేయాల‌న్నారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని వెల్ల‌డించారు. జీవో 7 ద్వారా విద్యార్థులకు నష్టం జ‌రుగుతుంద‌ని, రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎత్తేసే కుట్రలో భాగంగానే ఈ జీవో తీసుకొచ్చార‌ని విమ‌ర్శించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవ‌ర‌ణ‌లో బీస్టూడెంట్స్ ఫెడ‌రేష‌న్ రాష్ట్ర అధ్య‌క్షుడు కొమ్మ‌న‌బోయిన సైదులు యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో జీవో 7 ప్ర‌తుల‌ను ఐక్య విద్యార్థి సంఘాలు చించివేసి నిర‌స‌న తెలిపారు. ఈ సంద‌ర్భంగా సంఘాల నాయ‌కులు మాట్లాడుతూ.. ఒకవైపు ప్రభుత్వం కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోకూడద‌ని కళాశాల యాజమాన్యాలకు చెపుతున్నప్పటికీ, వారుమాత్రం ఏ మాత్రం లెక్క చేయకుండా విద్యార్థుల నుండి ఫిజుల‌ను ముక్కు పిండి వసూలు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

ప్రభుత్వం ఏర్పడి రెండు ఏండ్లు దాటినా ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేకుండా అనాలోచిత వైఖ‌రిని కొనసాగిస్తుంద‌ని వాపోయారు. రాష్ట్రంలో ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులపై వివక్షత ఎందుకు చూపుతున్నార‌ని ప్ర‌శ్నించారు. విద్యాశాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల విద్యార్థుల‌ను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర ప‌న్నుతున్నార‌ని మండిప‌డ్డారు. ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులు మానసికంగా ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని, అంతా పేద విద్యార్థులేన‌ని చెప్పారు.

రాష్ట్రంలో మే 8 వరకు అడ్మిషన్లు చేపట్టకూడ‌ద‌ని ఇంటర్ బోర్డు చెబుతుంద‌ని, ప్రైవేట్ కాలేజీల‌ యాజమాన్యాలు అడ్మిషన్లు తీసుకోని 50 శాతం ఫీజులు కట్టించుకున్నాయ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ‌ విధానాలు వారికి వర్తించవా అని ప్ర‌శ్నించారు. మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో ఇప్ప‌టికే త‌ర‌గ‌త‌లు ప్రారంభించార‌ని చెప్పారు. ఆ కాలేజీల‌పై ఎందుకు చర్య లు తీసుకోవడం లేద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జేవీఎస్‌ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేరాల వంశీ, ఓయూ విద్యార్థి నాయకులు ప్రభాకర్, అనిల్, సాయి కిరణ్, అనిల్, కుమార్, సంజయ్, శివ, అనిల్ నాయక్, నరేష్, సురేష్, అభి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement