త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | ఢిల్లీ లాఠీచార్జ్‌కు ఒక న్యాయం.. హైద‌రాబాద్ లాఠీచార్జ్‌కు ఒక న్యాయ‌మా?

Dasoju Sravan | ఢిల్లీలో జరిగిన లాఠీ చార్జ్‌కు ఒక న్యాయం.. హైదరాబాదులో నిరుద్యోగులపై జరిగిన లాఠీచార్జ్‌కు ఒక న్యాయమా? అని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు. నీట్ పేప‌ర్ లీక్‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, టీజీపీఎస్‌సీ గ్రూప్ 1 పరీక్షల తారుమారుకు బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Jul 23, 2026, 3.04 pm IST

Dasoju Sravan | ఢిల్లీ లాఠీచార్జ్‌కు ఒక న్యాయం.. హైద‌రాబాద్ లాఠీచార్జ్‌కు ఒక న్యాయ‌మా?
Advertisement
  • ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, రేవంత్‌రెడ్డి రాజీనామాలు చేయాలి
  • నీట్‌, టీజీపీఎస్ఈ గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల అవ‌క‌త‌వ‌క‌ల‌కు వారిదే బాధ్య‌త
  • ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్ట కాల్చుకుంటా నిప్పు ఉందా అన్నట్లుంది సీఎం, మంత్రుల తీరు
  • మీడియా స‌మావేశంలో ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ తీవ్ర విమ‌ర్శ‌లు

Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్‌: ఢిల్లీలో జరిగిన లాఠీ చార్జ్‌కు ఒక న్యాయం.. హైదరాబాదులో నిరుద్యోగులపై జరిగిన లాఠీచార్జ్‌కు ఒక న్యాయమా? అని ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు. నీట్ పేప‌ర్ లీక్‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌, టీజీపీఎస్‌సీ గ్రూప్ 1 పరీక్షల తారుమారుకు బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ అంటున్నాడ‌ని.. మ‌రి రేవంత్‌ను రాజీనామా చేయాలని ఎందుకు అనడం లేదని ప్ర‌శ్నించారు. పైగా నీట్ పరీక్ష పేపర్ లీక్‌ను కేటీఆర్‌కు లింక్ పెట్టి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రేపు ఇందిరాపార్క్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటార‌ని, యువ‌త పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో మాట్లాడారు.

2026, జూలై 24 ఒక ప్రాముఖ్యత కలిగిన దినం.. ఎందుకంటే మా నాయకుడు కేటీఆర్ 50వ పుట్టినరోజు. ఢిల్లీలో జరిగిన దాష్టీకానికి నిరసనగా రేపు ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొంటున్నారు. పుట్టిన రోజు సంబురాలకు దూరంగా ఉండి సంఘర్షణలో పాల్గొంటున్నారు. యువత కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలి. నీట్ పరీక్షపై జరుగుతున్న పోరాటంలో అందరం సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది. గత రెండు ఏండ్లుగా యువతకు కేటీఆర్ మద్దతుగా ఉంటున్నారు. యువ సంగ్రామ సదస్సులో విద్యార్థుల ఆక్రోశం ఏ విధంగా ఉందో మనం చూశాం. కొనసాగింపుగా రేపు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది అని దాసోజు పేర్కొన్నారు.

జీవో 29, గ్రూప్ 1, జీవో 46 రద్దుపై కేటీఆర్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయి. ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే.. చుట్ట కాల్చుకుంటా నిప్పు ఉందా అన్నట్లు ముఖ్యమంత్రి, మంత్రుల వ్యవహారశైలి ఉంది. కాంగ్రెస్ పార్టీకి నీట్ పరీక్షపై నిరసన తెలిపే నైతిక హ‌క్కు లేదు. నీట్ పరీక్ష పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాల్సిందే. టీజీపీఎస్‌సీ (TGPSC) గ్రూప్ 1 పరీక్షల తారుమారుకు పూర్తి బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ అన్నప్పుడు
రేవంత్‌ను రాజీనామా చేయాలని ఎందుకు అనడం లేదు అని ఎమ్మెల్సీ దాసోజు నిల‌దీశారు.

రేవంత్ రెడ్డికి ఆవు కథ బాగా సెట్ అవుతది..

జీవో 29 నిరుద్యోగులకు పెనుశాపంగా మారడానికి ఈ ప్రభుత్వమే కారణం. దీనిపై కేటీఆర్ నిరంతరంగా పోరాటం చేస్తున్నాడు. సిగ్గు ఎగ్గు నైతికత ఉంటే విద్యా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆవు కథ బాగా సెట్ అవుతుంది. పొద్దున లేస్తే మోడీని బడే భాయ్ అనే రేవంత్ రెడ్డి.. నీట్ పరీక్ష లీక్ పై ఎందుకు విమర్శించడం లేదు అని దాసోజు ఫైర‌య్యారు.

Advertisement
Advertisement