Sudheer Jalagam | రేవంత్‌కు ఎథిక్స్ నేర్పండి.. స్పెషల్ క్లాసు తీసుకోండి..
Sudheer Jalagam | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసి.. సర్టిఫికెట్ అందుకున్న విషయం తెలిసిందే. జనవరి 25 నుంచి 30 వరకు లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరిట నిర్వహించిన ప్రత్యేక తరగతులకు సీఎం హాజరయ్యారు.
Sudheer Jalagam | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసి.. సర్టిఫికెట్ అందుకున్న విషయం తెలిసిందే. జనవరి 25 నుంచి 30 వరకు లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ పేరిట నిర్వహించిన ప్రత్యేక తరగతులకు సీఎం హాజరయ్యారు. అయితే రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ పర్యటనకు ముందే జనవరి 21న తెలంగాణ ఉద్యమకారుడు, ఎన్నారై సుధీర్ జలగం.. యూనివర్సిటీ ఫ్యాకల్టీ చైర్, అడ్మిషన్స్ కమిటీకి ఓ లేఖ రాశారు. లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ తరగతులకు హాజరయ్యే సీఎం రేవంత్ రెడ్డికి ఎథికల్ రెస్సాన్సిబిలిటీస్ నేర్పండి.. స్పెషల్ క్లాసులు తీసుకోండి అని సుధీర్ జలగం ఈమెయిల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లీడర్‌షిప్ క్వాలిటీస్ పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కోర్సుకు.. అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్న తెలంగాణ పరిపాలనను, చట్టపరమైన సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తున్నట్లు సుధీర్ జలగం తన లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటిని ఒక ప్రత్యేక కేసుగా పరిగణించి.. ముఖ్యమంత్రికి నిర్ధిష్ట నైతిక మార్గదర్శకత్వాన్ని అందించాలని అభ్యర్థిస్తున్నట్లు సుధీర్ జలగం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం, రాజకీయాల కోసం ప్రతిపక్షాల గొంతును నొక్కేయడం వంటి అంశాలను లేఖలో సుధీర్ ప్రస్తావించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఓటుకు నోటు కేసులో సీఎం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై అసభ్యకరమైన పదజాలం ప్రయోగిస్తూ.. ఎన్నికల హామీలను విస్మరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ సీఎం సామాన్యులను సైతం హింసిస్తున్నారని లేఖలో సుధీర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సీఎం నైతిక బాధ్యతలపై ప్రత్యేక మార్గదర్శకత్వం అందించాలని సుధీర్ కోరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harvard Medical School | మార్చురీ మేనేజర్ నిర్వాకం.. బ్లాక్మార్కెట్లో మృతదేహాల భాగాల విక్రయం.. 440 కోట్ల పరిహారం..
ఆగస్టు 21, 2026

KTR | అగమ్యగోచరంగా పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం : కేటీఆర్
ఆగస్టు 20, 2026

Kalyana Lakshmi | పెళ్లై పిల్లలు కూడా పుట్టారు.. ఇంకా కళ్యాణలక్ష్మీ చెక్ రాలేదు
ఆగస్టు 20, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..
- ●EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా
- ●Harvard Medical School | మార్చురీ మేనేజర్ నిర్వాకం.. బ్లాక్మార్కెట్లో మృతదేహాల భాగాల విక్రయం.. 440 కోట్ల పరిహారం..
- ●Boat Capsizes | నైజీరియాలో నీట మునిగిన పడవ.. 50 మందికిపైగా మృతి.. ఎక్కువ మంది చిన్నారులే..

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో ఉత్సాహం..

Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు

Stock Markets | స్టాక్ మార్కెట్లలో స్వల్ప నష్టాలు.. బ్యాంకింగ్ షేర్ల మద్దతు..

EFLU | ఇఫ్లూలో విద్యార్థి సంఘాల మధ్య గొడవ.. 14 మంది సస్పెండ్.. ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థుల ధర్నా



