త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naveen Reddy | బీజేపీపై తెలంగాణ స‌మాజం తిర‌గ‌బ‌డుతుంది: ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి

Naveen Reddy | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (MP Tejasvi Surya ) బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్య‌క్షుడు న‌వీన్ రెడ్డి (Naveen Reddy) డిమాండ్ చేశారు.

G

Telangana | Published On Apr 17, 2026, 7.30 am IST

Naveen Reddy | బీజేపీపై తెలంగాణ స‌మాజం తిర‌గ‌బ‌డుతుంది: ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి
Advertisement

Naveen Reddy | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్ముతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (MP Tejasvi Surya ) బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్య‌క్షుడు న‌వీన్ రెడ్డి (Naveen Reddy) డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడితే బీజేపీపై తెలంగాణ సమాజం తిరగబడుతుందని హెచ్చ‌రించారు. రాష్ట్ర‌ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చినా.. తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండడం సిగ్గు చేటనీ, రానున్న రోజుల్లో రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పక బుద్ధి చెప్తార‌ని హెచ్చ‌రించారు. తేజస్వీ సూర్య పార్లమెంట్ సభ్యత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

లోక్‌స‌భ‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుతో పాటు డీలిమిటేష‌న్ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై క‌ర్ణాట‌క బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌, ఏపీ విభ‌జ‌న‌ను ఇండియా, పాకిస్తాన్ విభ‌జ‌న‌తో పోల్చారు. గతంలో భారత్ నుంచి పాకిస్తాన్ ను ఎలా అశాస్త్రీయంగా విడదీశారో అలాగే తెలంగాణను కూడా విడదీశారని తేజ‌స్వీ సూర్య పేర్కొన్నారు. ఈ విభజనలో కనీస శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదన్నారు. కాబట్టి బ్రిటిష్ వారు చేసిన దేశ విభజన కంటే కాంగ్రెస్ చేసిన ఏపీ విభజన దారుణంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, భవిష్యత్తును రాష్ట్ర విభజన సందర్బంగా అస్సలు పట్టించుకోలేదని తేజస్వీ సూర్య ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

 

Advertisement
Advertisement