Prashanth Reddy | సింగరేణి కాంట్రాక్ట్ బయటపెట్టినందుకే నోటీసులు: మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
Prashanth Reddy | సింగరేణి (Singareni) బొగ్గు గనుల కాంట్రాక్ట్ బయటపెట్టినందుకే హరీశ్‌రావు (Harish Rao)కు సిట్ (CIT) నోటీసులు జారీ చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy) ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మంత్రులు రెండేళ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడుతున్నారని, వాటిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నామని గుర్తు చేశారు.
Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్ : సింగరేణి (Singareni) బొగ్గు గనుల కాంట్రాక్ట్ బయటపెట్టినందుకే హరీశ్‌రావు (Harish Rao)కు సిట్ (CIT) నోటీసులు జారీ చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (Prashanth Reddy) ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మంత్రులు రెండేళ్ల నుంచి కుంభకోణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రెండేళ్ల నుంచి మంత్రలు కుంభకోణాలను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నామని గుర్తు చేశారు. కుంభకోణాలను శాసనసభ వేదికగా ప్రజాక్షేత్రంగా బయటపెడుతుంటే తమకు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ప్రశాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఒకసారి కాళేశ్వరం కేసు అని, మరోసారి ఈ కార్ రేసు కేసని, మరోసారి విద్యుత్ కేసని విచారణ పేరుతో పిలుస్తున్నారని చెప్పారు. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలును నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దండుపాళెం ముఠా ప్రభుత్వాన్ని నడిపిస్తుందని దుయ్యబట్టారు. ఆ బ్యాచ్‌కు నాయకుడు ముఖ్యమంత్రి అని, మంత్రులంతా సభ్యులని ఎద్దేవా చేశారు. సివిల్ సప్లై విభాగంలో పెద్ద ఎత్తన అవినీతి జరిగిందని ఆరోపించారు. సమ్మక్క, సారక్క టెండర్ల విషయంలో మంత్రుల మధ్య కొట్లాట జరిగిందన్నారు. పారిశ్రామిక భూములను రేవంత్‌రెడ్డి తన బంధువులకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. హ్యామ్ రోడ్ల పేరుతో కుంభకోణం జరగబోతుందని అన్నారు. రూ.1600 కోట్ల విలువైన బొగ్గు గనుల కాంటాక్ట్ విషయంలోనే ముఖ్యమంత్రి , మంత్రులకు మధ్య గొడవ జరిగిందని చెప్పారు. రోజుకొక కుంభకోణాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ఈ కుంభకోణాలపై సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
టీవీ సీరియల్ మాదిరిగా రోజుకో కేసు పేరుతో డ్రామా నడిపిస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రశ్నిస్తుంటే తమపై కేసులు పెడుతున్నారని వాపోయారు. ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా రేవంత్‌రెడ్డి అవినీతిని బయటపెడుతూనే ఉంటామని ప్రకటిఆంచారు. ప్రజల కోసం జైలుకు వెళ్లిన వ్యక్తి హరీశ్‌రావు అని గుర్తు చేశారు. తామంతా కేసీఆర్ సైనికులమని, ఎవరికీ భయపడబోమని అన్నారు. హరీశ్‌రావు వెంట యావత్ తెలంగాణ సమాజం ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కావాలనే హరీశ్‌రావు హరీష్ రావుపై కావాలని నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



