త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavitha | మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోస‌మే కేసీఆర్‌కు నోటీసులు: క‌విత‌

Kavitha | మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతోనే మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ (KCR) కు సిట్ (SIT) నోటీసులు జారీ చేసింద‌ని మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) అన్నారు. సిట్ పేరుతో గుంపుమేస్త్రీ నాట‌కాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. సిట్ విచార‌ణ నాన్ సీరియ‌స్‌గా న‌డుస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

A

Telangana | Published On Jan 29, 2026, 5.51 pm IST

Kavitha | మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోస‌మే కేసీఆర్‌కు నోటీసులు: క‌విత‌
Advertisement

Kavitha | త్రినేత్ర‌.న్యూస్‌ : మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతోనే మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ (KCR) కు సిట్ (SIT) నోటీసులు జారీ చేసింద‌ని మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్య‌క్షురాలు క‌విత (Kavitha) అన్నారు. సిట్ పేరుతో గుంపుమేస్త్రీ నాట‌కాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. సిట్ విచార‌ణ నాన్ సీరియ‌స్‌గా న‌డుస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. జాతీయ జ‌న‌గ‌ణ‌న‌లో కుల‌గ‌ణ‌న - స‌మ‌గ్ర చ‌ర్చ పేరుతో నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో క‌విత పాల్గొన్నారు. అనంత‌రం ఆమె విలేక‌రుల‌తో మాట్లాడుతూ సిట్ విచార‌ణ‌ను త్వ‌రిత‌గ‌తిన ముగించాలని హిత‌వు ప‌లికారు. ఆ దిశ‌గా ప్ర‌భుత్వం ఆలోచిస్తుందో లేదో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదని అభిప్రాయ‌ప‌డ్డారు. ఫోన్ ట్యాపింగ్ బాధాక‌రమ‌ని అన్నారు. నేర‌స్థుల‌కు శిక్ష ప‌డుతుందో లేదో వేచి చూడాలని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement