త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు?

Phone Tapping | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ (Telangana) రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో త్వ‌రలోనే మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR), మ‌రో ఇద్ద‌రు మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హ‌రీశ్‌రావు (Harish Rao) ల‌కు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

A

Telangana | Published On Dec 23, 2025, 2.28 pm IST

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు?
Advertisement

Phone Tapping | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ (Telangana) రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీల‌క మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో త్వ‌రలోనే మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR), మ‌రో ఇద్ద‌రు మాజీ మంత్రులు కేటీఆర్ (KTR), హ‌రీశ్‌రావు (Harish Rao) ల‌కు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. శీతాకాల అసెంబ్లీ స‌మావేశాలు ముగిసిన అనంత‌రం ఈ నోటీసులు ఇచ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఫోన్‌ట్యాపింగ్ కేసులో సిట్ విచార‌ణ‌లో ఉన్న ఎస్ఐబీ (SIB) మాజీ చీఫ్ ప్ర‌భాక‌ర్‌రావు (Prabhakar Rao) అప్ప‌టి ప్ర‌భుత్వ పెద్ద‌లైన కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల కోస‌మే ట్యాపింగ్ చేసిన‌ట్లు వెల్ల‌డించిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఒక ప్రైవేట్ న్యూస్ చాన‌ల్ ఎండీతో క‌లిసి హ‌రీశ్‌రావు కొంత‌మంది ప్ర‌ముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేయించిన‌ట్లు, మ‌రికొంత మంది కోసం కేటీఆర్ టాపింగ్ చేయించిట్లు కూడా అధికారులు గుర్తించిన‌ట్లు భోగ‌ట్టా.

Advertisement

తాజావార్తలు

Advertisement